వాట్సాప్ ను యూజర్లు అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఫొటోలు, వీడియోలు, టెక్స్ట్ మెసేజ్ లతో పాటు వాయిస్ మెసేజ్ లను కూడా పంపించుకోవచ్చు. అయితే, టైప్ చేయడం కన్నా వాయిస్ మెసేజ్ పంపించడం సులభంగా ఉన్నప్పటికీ, అవి బయట వినిపించడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందిగా మారుతుంది. ఇంట్లో ఉండగా పెద్దగా సమస్య ఉండదు, కానీ సినిమా థియేటర్ లో, కార్యాలయంలో, ట్రాఫిక్ లో ఉండగా వాయిస్ మెసేజ్ వినడం కష్టం అవుతుంది.

ఈ సమస్యకు పరిష్కారంగా వాట్సాప్ “వాయిస్ మెసేజ్ టాన్స్క్రిప్ట్” ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ వాయిస్ మెసేజ్ ను టెక్స్ట్ రూపంలో మార్చి చూపిస్తుంది.
వాట్సాప్ టాన్స్క్రిప్షన్ ఫీచర్ గురించి
వాట్సాప్ యాజమాన్యం 2024 నవంబర్ లో ఈ ఫీచర్ ను ప్రకటించింది. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. త్వరలో ఐఓఎస్ యూజర్లకూ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.
ఈ ఫీచర్ ద్వారా ఇంగ్లీష్, స్పానిష్, పోర్చుగీస్, రష్యన్ వంటి భాషల్లో వాయిస్ మెసేజ్ లను టెక్స్ట్ రూపంలో చూడవచ్చు. అయితే హిందీకి ఇప్పుడే మద్దతు లేదు. భవిష్యత్తులో మరిన్ని భాషలకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
టాన్స్క్రిప్షన్ ఫీచర్ ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?
- వాట్సాప్ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.
- చాట్స్ విభాగాన్ని ఎంచుకోవాలి.
- వాయిస్ మెసేజ్ టాన్స్క్రిప్ట్ విభాగానికి వెళ్లాలి.
- అందుబాటులో ఉన్న భాషల నుండి నచ్చిన భాషను ఎంపిక చేసుకోవాలి.
- ఆ తర్వాత వచ్చిన వాయిస్ మెసేజ్ ను నొక్కి పట్టుకుని, “మరిన్ని ఎంపికలు” ఓపెన్ చేసి, “ట్రాన్స్ క్రైబ్” ఎంపిక చేసుకోవాలి.
దీని ద్వారా యూజర్లు వాయిస్ మెసేజ్ లను నచ్చిన భాషలో టెక్స్ట్ రూపంలో చదువుకోవచ్చు.