అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్గా నటించిన తాజా చిత్రం తండేల్. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అందమైన ప్రేమకథగా రూపుదిద్దుకున్న ఈ సినిమా, ప్రేక్షకులను ఎమోషనల్గా కట్టిపడేసింది.

ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి తమ అద్భుతమైన నటనతో అలరించారు. రాజు, సత్య పాత్రల్లో జీవించి నటించారని, ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో చైతూ నటన హైలైట్గా నిలిచిందని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దర్శకుడు చందూ మొండేటి, వీరి ప్రేమకథను అద్భుతంగా మలిచాడు.
సినిమాకు సంగీతం ప్లస్ పాయింట్
ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విడుదలకు ముందే పాటలు, ట్రైలర్ ద్వారా అంచనాలు పెంచుకున్న ఈ సినిమా, రిలీజ్ అయిన తర్వాత సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లు రాబడుతోంది. ఇది నాగ చైతన్య కెరీర్లో ప్రత్యేకమైన చిత్రం గా నిలిచింది.
తండేల్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇప్పుడు అందరికీ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తండేల్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ Netflix భారీ ధరకు ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది. ముందుగా మార్చి 6న స్ట్రీమింగ్ కానుందని వార్తలు వచ్చినప్పటికీ, తాజాగా మార్చి 14న నెట్ఫ్లిక్స్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
తండేల్ సినిమాను థియేటర్లో మిస్ అయినవాళ్లు, త్వరలోనే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుండటంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ఓటీటీలో కూడా అదే స్థాయిలో హిట్ అవుతుందేమో చూడాలి!