• Home
  • Entertainment
  • ధనుష్ పై ప్రశంసలు కురిపించిన అనిఖా సురేంద్రన్..!
Image

ధనుష్ పై ప్రశంసలు కురిపించిన అనిఖా సురేంద్రన్..!

ధనుష్ పై ప్రశంసలు కురిపించిన అనిఖా సురేంద్రన్..!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. నటనతో పాటు దర్శకత్వంలో కూడా తన ప్రతిభను నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇటీవలే తాను దర్శకత్వం వహించిన నిలవుక్కు ఎన్ మేల్ ఎనాది కోపం’ సినిమా తర్వాత ‘ఇడ్లీ కడై’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కూడా నటిస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత, టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కుబేర’ సినిమాలోనూ ధనుష్ నటిస్తున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ హీరోగానే కాకుండా, దర్శకుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ధనుష్ దర్శకత్వంలో వచ్చిన ‘రాయన్’ సినిమాతో ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే, తాజాగా విడుదలైన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ అనే చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా విడుదలైన వెంటనే మంచి టాక్ అందుకుంది.

ఇక, హీరోగా మాత్రమే కాకుండా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుసగా సినిమాలను లైనప్ చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు ధనుష్. ఈ నేపథ్యంలో ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనిఖా సురేంద్రన్ ధనుష్ పై ప్రశంసలు కురిపించింది.

ధనుష్ వల్ల నా కోరిక నెరవేరింది – అనిఖా సురేంద్రన్

ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, అనిఖా సురేంద్రన్ హీరోయిన్లుగా నటించారు. అనిఖా సురేంద్రన్ చిన్నప్పటి నుండే సినిమాల్లో నటిస్తోంది. అజిత్ నటించిన పలు చిత్రాల్లో బ్యాక్ టు బ్యాక్ ఆయన కూతురిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు హీరోయిన్ గా మారి తెలుగు, తమిళ పరిశ్రమల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటోంది.

తెలుగులో ‘బుట్టబొమ్మ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనిఖా సురేంద్రన్, జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకుంది. తాజాగా అనిఖా ధనుష్ గురించి మాట్లాడుతూ, సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది.

జాబిలమ్మ నీకు అంత కోపమా పూర్తి అయ్యింది. ధనుష్ సార్‌కి ఎప్పటికీ కృతజ్ఞతలు. మీరు నా కలలను నిజం చేశారు. నేను ధనుష్ సార్‌కు పెద్ద అభిమానిని. ఒక్కసారి అవకాశం కావాలని అడిగాను. వెంటనే ఆయన నన్ను సినిమాలో నటించేలా చేశారు. ధనుష్ దర్శకత్వంలో నటించడం నా కల కూడా కాదు. ఇది నిజమైనందుకు ఆయనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.”

అని అనిఖా సురేంద్రన్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

ధనుష్‌తో పని చేయడం అనిఖాకు గొప్ప అనుభవంగా మారింది. దీంతో ఆమె అభిమానులు ఆనందంతో తెగ మురిసిపోతున్నారు. ఇకపై అనిఖా మరిన్ని మంచి సినిమాల్లో నటించాలని ఆమె ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

https://www.instagram.com/p/DGVwIjhSjow/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Releated Posts

మహేష్ బాబు చేయాల్సిన సినిమా దక్కించుకున్న రామ్ చరణ్…!!

సినీ పరిశ్రమలో ఒక కథ మరో హీరోకి వెళ్ళడం సాధారణమే. కానీ కొన్నిసార్లు అది ఒకరి కెరీర్‌ను మలుపు తిప్పే విధంగా మారిపోతుంది. అలాంటి…

ByByVedika TeamApr 19, 2025

షైన్ టామ్ చాకో అరెస్ట్ – డ్రగ్ కేసులో కీలక మలుపు..!!

ప్రముఖ నటుడు మరియు ‘దసరా’ విలన్‌ షైన్ టామ్ చాకో ఇటీవల వార్తల్లో హాట్ టాపిక్ అయ్యారు. రెండు రోజులుగా హోటల్ నుంచి తప్పించుకుని…

ByByVedika TeamApr 19, 2025

కేఎల్ రాహుల్ కుమార్తెకు నామకరణం: “ఇవారా” అర్థం ఏమిటి?

భారత క్రికెట్ స్టార్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి గత ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మార్చి 24న వీరిద్దరికీ ఓ…

ByByVedika TeamApr 18, 2025

మ్యాడ్ స్క్వేర్ థియేటర్ హిట్‌ తర్వాత ఓటీటీలోకి..??

చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సాధించిన సినిమాల్లో మ్యాడ్ ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. దర్శకుడు కళ్యాణ్ శంకర్ రూపొందించిన ఈ యువతరానికి…

ByByVedika TeamApr 18, 2025

Leave a Reply