స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నెట్స్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. అర్షదీప్ సింగ్, మొహమ్మద్ షమీ బౌలింగ్‌లో కోహ్లీ, రోహిత్ గంటకు పైగా ప్రాక్టీస్ చేశారు. కోహ్లీ డౌన్ ది స్టంప్ లైన్ డెలివరీలు ఎదుర్కొంటూ ఫ్లిక్, ఆన్ డ్రైవ్ షాట్లను ఎక్కువగా ప్రాక్టీస్ చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో ఇన్ కమింగ్ డెలివరీలు, యార్కర్లను అధికంగా ప్రాక్టీస్ చేశాడు.

నెట్ ప్రాక్టీస్ సందర్భంగా ఆదివారం రిషభ్ పంత్‌కు బాల్ తగలడంతో టీమ్ సపోర్ట్ స్టాఫ్ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. హార్ధిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో “వాచ్ ద బాల్” అంటూ అందరినీ అలెర్ట్ చేశారు.















