మెగా హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొన్న ఆయన బుధవారం నాడు ఆళ్లగడ్డలోని అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఆలయ వేద పండితుల నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సాయి తేజ్, దర్శన అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ సిబ్బంది, జనసేన నాయకులు, మెగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
మీడియాతో మాట్లాడిన ఆయన సంబరాల ఏటిగట్టు సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. చిరంజీవితో కలిసి నటించే అవకాశాన్ని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు.
రాజకీయ ఎంట్రీపై స్పందిస్తూ, తాను ప్రస్తుతానికి ఆ దిశగా ఆలోచించలేదని, రాజకీయాలు మాట్లాడడం ఈజీ అయినప్పటికీ చేయడం అంత సులభం కాదని అన్నారు. ప్రస్తుతం నటనపై పూర్తిగా దృష్టి సారించినట్లు తెలిపారు.
అలాగే యువతకు ఓ కీలక సందేశం ఇస్తూ – బైక్ రైడ్ చేసే యువతీయువకులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ, తన పెద్ద మామయ్యతో కలిసి నటించే రోజు కోసం ఎదురుచూస్తున్నానని, ఆ అవకాశం త్వరలో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సాయిధరమ్ తేజ్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.















