మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్.. విజయవాడకు తరలింపు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి, విజయవాడకు తరలించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఈ నెల 20న వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రావాల్సి ఉంది.

పటమట పోలీసులు వంశీపై BNS సెక్షన్ 140(1), 308, 351(3), రెడ్ విత్ 3(5) కింద కేసులు నమోదు చేశారు. ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ, కిడ్నాప్, హత్యాయత్నం, బెదిరింపు వంటి మరికొన్ని కేసులు కూడా వంశీపై పెట్టారు. వంశీ అరెస్టుకు సంబంధించి ఆయన భార్యకు పటమట పోలీసులు నోటీస్ ఇచ్చారు.
కేసులో అనూహ్య మలుపు
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందని ఫిర్యాదు చేసిన సత్యవర్థన్, ఇటీవల కేసు వెనక్కు తీసుకుంటున్నట్లు అఫిడవిట్ దాఖలు చేశారు. సత్యవర్థన్ హఠాత్తుగా పిటిషన్ విత్‌డ్రా చేసుకోవడం రాజకీయంగా సంచలనంగా మారింది. దీనిపై అతను బెదిరింపులకు గురయ్యాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ కేసులో ఇవాళ కోర్టులో విచారణ జరగనుండగా, ఇదే సమయంలో హైదరాబాద్‌లో వంశీ అరెస్ట్ కావడం రాజకీయంగా మరింత చర్చనీయాంశంగా మారింది. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులోనే వల్లభనేని వంశీ అరెస్ట్ అయినట్టు తెలుస్తోంది.















