జపనీయుల ఆరోగ్య రహస్యాలు – బరువు పెరగకుండా ఉండటానికి 7 ముఖ్యమైన అలవాట్లు
జపనీయులు ఫిట్‌గా ఉండటానికి అనేక ప్రత్యేకమైన అలవాట్లను పాటిస్తారు. వారు తమ ఆహారం మరియు జీవనశైలిలో కొన్ని నియమాలను పాటించడం వల్ల ఆరోగ్యంగా, దీర్ఘకాలం బతికే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా, బరువు పెరగకుండా ఉండటానికి వారు అనుసరించే 7 ముఖ్యమైన అలవాట్ల గురించి తెలుసుకుందాం.

1. వివిధ రకాల ఆహారం తినడం
జపనీయులు చిన్న మొత్తాల్లో తిన్న కానీ విభిన్న రకాల ఆహారాన్ని తినటం అలవాటు చేసుకున్నారు. ఈ విధానం శరీరానికి సమతుల్య పోషకాలను అందిస్తుంది, అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. పరిశోధనల ప్రకారం, ఇది బరువును అదుపులో ఉంచేందుకు ఎంతగానో సహాయపడుతుంది.
2. నెమ్మదిగా తినడం
జపనీయులు నెమ్మదిగా, ఆహారాన్ని ఆస్వాదిస్తూ తింటారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు, తక్కువ మొత్తంలోనే తృప్తి కలిగించేలా చేస్తుంది. దీనివల్ల అధికంగా తినకుండా నియంత్రించుకోవచ్చు.
3. రోజువారీ వ్యాయామం
నడక, సైక్లింగ్, యోగా వంటి శారీరక శ్రమను వారు తమ రోజువారీ జీవితంలో భాగంగా చేసుకుంటారు. ఇది జీవక్రియను మెరుగుపరచి, ఆరోగ్యకరమైన బరువును కాపాడేందుకు సహాయపడుతుంది.
4. హర హచి బు సూత్రం పాటించడం
“హర హచి బు” అనేది జపనీయుల ప్రాచీన ఆహార నియమం. దీని ప్రకారం 80% కడుపు నిండిన తరువాత తినడం ఆపేయాలి. ఇది అధికంగా తినకుండా నియంత్రించి, బరువు పెరగకుండా ఉండటానికి సహాయపడుతుంది.
5. తక్కువ చక్కెర – ఎక్కువ గ్రీన్ టీ
జపనీయులు చక్కెరను తక్కువగా తీసుకుని, గ్రీన్ టీని అధికంగా తాగుతారు. గ్రీన్ టీ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా కలిగి ఉండడం వల్ల జీవక్రియను పెంచి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
6. కాలానుగుణంగా ఆహారం తినడం
ప్రతి కాలానికి అనుగుణంగా లభించే తాజా పదార్థాలతో తయారైన ఆహారాన్ని తినడం జపనీయుల అలవాటు. ఇది మంచి పోషకాలను అందించడంతో పాటు అనారోగ్యకరమైన ఆహారాన్ని తగ్గించేందుకు సహాయపడుతుంది.
7. కలిసి భోజనం చేయడం
జపాన్ సంస్కృతిలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి భోజనం చేయడం ఒక ఆనవాయితీ. ఇది నెమ్మదిగా తినేందుకు, తక్కువ మొత్తంలో తినేందుకు ప్రోత్సహిస్తుంది.
ఈ 7 అలవాట్లను అనుసరించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, బరువును అదుపులో ఉంచుకోవచ్చు. ఈ అలవాట్లను మన జీవితంలో కూడా ప్రవేశపెడితే, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం మరింత సులభం అవుతుంది.

















