పిస్తాపప్పు ఆరోగ్య ప్రయోజనాలు
Pistachios: పిస్తాపప్పులో జింక్ అధికంగా ఉంటుంది, ఇది రోగనిరోధక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడే ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్ B6 రోగనిరోధక పనితీరుకు అవసరమైన ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.

అలాగే, ఇందులోని సెలీనియం యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. కొన్ని ఆహారాలు వాతావరణాన్ని బట్టి మన శరీరానికి మేలు చేస్తాయి. అలాంటి వాటిలో పిస్తాపప్పు ఒకటి. ఇది శీతాకాలంలో శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
పిస్తాపప్పులోని పాలీఫెనాల్స్, కెరోటినాయిడ్లు రోగనిరోధక కణాల కార్యకలాపాలను పెంచుతాయి. ఇందులోని ప్రీబయోటిక్ లక్షణాలు పేగులోని మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. ఇది శ్లేష్మ పొర రోగనిరోధక వ్యవస్థను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పిస్తాపప్పును మీ రోజువారీ ఆహారంలో తప్పక చేర్చుకోవడం ఎంతో అవసరం. దీనిని సలాడ్లు, డెజర్ట్‌లు, ఇతర వంటకాల్లో చేర్చి రుచిగా తీసుకోవచ్చు.