• Home
  • National
  • భారతదేశాన్ని గ్లోబల్ పవర్‌హౌస్‌గా మార్చడమే లక్ష్యం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము…!!
Image

భారతదేశాన్ని గ్లోబల్ పవర్‌హౌస్‌గా మార్చడమే లక్ష్యం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము…!!

భారతదేశాన్ని గ్లోబల్ పవర్‌హౌస్‌గా మార్చడమే లక్ష్యం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో, పార్లమెంట్‌లో ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా, రాష్ట్రపతి ముర్ము అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో రైతులు, సైనికులు, సైన్స్, మరియు పరిశోధనలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

భారతదేశాన్ని గ్లోబల్ పవర్ హౌస్‌గా మారుస్తామని పేర్కొన్నారు. విద్యా సంస్థల్లో పరిశోధనలను ప్రోత్సహించేందుకు రూ. 50,000 కోట్లు కేటాయించి, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించామని చెప్పారు. అలాగే, ప్రభుత్వం మధ్యతరగతి గృహాలు, గిరిజన సంక్షేమంపై కూడా దృష్టి సారించిందని, చిన్న వ్యాపారాలకు రెట్టింపు రుణాలను అందిస్తున్నట్లు తెలిపారు.

మహాకుంభ్‌లో జరుగుతున్న ఉత్సవాన్ని మరియు మౌని అమావాస్య నాడు జరిగిన ప్రమాదం పట్ల తన సంతాపాన్ని తెలియజేస్తూ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించారు. భారత్‌లో నిర్మించిన గగన్‌యాన్, స్పేస్ డాకింగ్‌లో విజయాలు భారతదేశం తన స్వంత స్పేస్ స్టేషన్‌ ను ఏర్పాటు చేసేందుకు మార్గం సులభతరం చేసినాయని అన్నారు.

సర్కార్ మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నదని, 13 భారతీయ భాషల్లో రిక్రూట్‌మెంట్ పరీక్షలు నిర్వహించడం వల్ల భాషా సంబంధిత అడ్డంకులు తొలగిస్తామని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా అందించాలని నిర్ణయించారు.

ప్రభుత్వం యువతకు విద్య, ఉపాధి అవకాశాలను ప్రోత్సహిస్తోందని, మధ్యతరగతి ప్రజల కోసం తీసుకునే చర్యలను అభినందనీయంగా అభివర్ణించారు. మోదీ మూడో టర్మ్‌లో దేశం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోందని, ప్రస్తుతం 3 రెట్లు వేగంగా పనులు సాగుతున్నాయని రాష్ట్రపతి ముర్ము తెలిపారు.

Releated Posts

భారత్-పాక్ కాల్పుల విరమణ అనంతరం ప్రధాని మోదీ ప్రసంగం: ఆపరేషన్ సింధూర్ వివరాలు

భారత్‌-పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో సరిహద్దు రాష్ట్రాల్లో శాంతి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ రాత్రి 8…

ByByVedika TeamMay 12, 2025

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

భారత్–పాకిస్తాన్ కాల్పుల విరమణలో తిరుగులేని ఉలుపు – మోదీ గట్టి హెచ్చరికతో పాక్ వెనక్కి…!!

భారత్‌, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై అంగీకారం వచ్చిన రెండు రోజులకు, జమ్మూ కశ్మీర్ సహా అంతర్జాతీయ సరిహద్దుల్లో పరిస్థితి చాలా వరకు ప్రశాంతంగా…

ByByVedika TeamMay 12, 2025

భారత ప్రతిదాడి: పాక్ ఎయిర్ బేస్‌లపై భారత వైమానిక దళం దాడులు…!!

పాక్ మళ్లీ భారత సరిహద్దులపై దాడులకు పాల్పడిన నేపథ్యంలో భారత్ కూడా తీవ్ర ప్రతిదాడికి దిగింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ వెల్లడించిన వివరాల…

ByByVedika TeamMay 10, 2025

Leave a Reply