టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన అదితి రావు హైదరీ ఇకపై సినిమాలకు గుడ్‌బై చెప్పనుందా? అసలు విషయం ఏంటంటే…
తొలి సినిమాతోనే తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న ఈ అందగత్తె, హిందీ, తమిళ, మలయాళ చిత్రసీమల్లోనూ తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం యూత్‌కి ఫేవరెట్ హీరోయిన్‌గా మారిన అదితి 2006లో మలయాళ చిత్రం ‘ప్రజాపతి’ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘శ్రీనగరం’ (తమిళం), ‘Delhi-6’ (హిందీ) సినిమాలతో వరుసగా పాపులర్ అయింది.

తెలుగులో ‘సమ్మోహనం’ (2018) ద్వారా అరంగేట్రం చేసిన అదితి, ఆ తర్వాత ‘అంతరిక్షం 9000 KMPH’, ‘V’, ‘మహా సముద్రం’ లాంటి సినిమాలు చేసింది. ప్రస్తుతం ‘గాంధీ టాక్స్’, ‘లయనెస్స్’ అనే చిత్రాల్లో నటిస్తోంది.
ఇటీవలే టాలీవుడ్ హీరో సిద్ధార్థ్ ని వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ, పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించిందన్న టాక్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆమె యాక్టివ్‌గా ఉంటూ కొత్త ఫోటోషూట్‌లతో అభిమానులకు టచ్‌లో ఉంటోంది. ఆమె తాజాగా షేర్ చేసిన ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.