ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 17 మంది మృతి చెందగా, మరో 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం అఖండ పరిషత్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానాలు ఆచరించాలన్న నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని ప్రకటించింది.
ప్రయాగ్‌రాజ్‌లోని సంగమం వద్ద భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తడంతో ఈ తొక్కిసలాట జరిగింది. భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడంతో ఈ ప్రమాదం జరిగింది. కాగా, తొక్కిసలాటలో 17 మంది మృతి చెందారు, 40 మందికి పైగా గాయపడ్డారు. వెంటనే సిబ్బంది అప్రమత్తమై క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన వెంటనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడి సంఘటన వివరాలను తెలుసుకున్నారు.
మహా కుంభమేళా సందర్భంగా, మౌని అమావాస్య పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అయితే, అఖండ పరిషత్ ఆచరించాలన్న అమృత స్నానాలు ఆచరించకుండా నిర్ణయాన్ని తీసుకోవడం, ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడింది.