పుష్ప 2: సినిమా థియేటర్లలో రాణించి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన అందుకుంది. ఈ సినిమా థియేటర్లలో విడుదలై రెండో నెలను పూర్తి చేసుకోకముందే, ఇప్పుడు ఓటీటీ విడుదల తేదీ కూడా ప్రకటించబడింది. అల్లు అర్జున్ నటించిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీ, పుష్ప 2: ది రూల్డ్, ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

జనవరి 30 నుండి పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. సినిమా 56 రోజులకు ఈ డిజిటల్ స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది. కొత్త సీన్లను అందించిన ఈ రీలోడెడ్ వెర్షన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
పుష్ప 2 ను 3 గంటల 20 నిమిషాల నిడివి తో విడుదల చేశారు. అయితే, ఈ రీలోడెడ్ వెర్షన్‌కు మరో 20 నిమిషాల అదనపు సన్నివేశాలు జతచేయడం ద్వారా మొత్తం సినిమా నిడివి 3 గంటల 40 నిమిషాలకు పెరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో పుష్ప 2 ను ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారు.