• Home
  • Entertainment
  • ప్రేమంటే ఇదే: క్యాన్సర్‌తో పోరాడుతోన్న ప్రముఖ హీరోయిన్‌కు ప్రియుడి అండ….!!
Image

ప్రేమంటే ఇదే: క్యాన్సర్‌తో పోరాడుతోన్న ప్రముఖ హీరోయిన్‌కు ప్రియుడి అండ….!!

ప్రేమంటే ఇదే: క్యాన్సర్‌తో పోరాడుతోన్న ప్రముఖ హీరోయిన్‌కు ప్రియుడి అండ

సంతోషాన్ని ప్రతి ఒక్కరూ పంచుకుంటారు. కానీ కష్టకాలంలో తోడుగా నిలిచేవాళ్లే నిజమైన ఆప్తులు. మనం కష్టాలు, బాధల్లో ఉన్నప్పుడు ధైర్యం చెప్పే వ్యక్తులు చాలా అరుదు. ఈ క్రమంలో, క్యాన్సర్‌తో పోరాడుతున్న ప్రముఖ బాలీవుడ్ నటి హీనా ఖాన్‌కు ఆమె ప్రియుడు రాకీ జైస్వాల్ ప్రతి అడుగులోనూ అండగా నిలుస్తున్నాడు.

హీనాకు కొద్ది నెలల క్రితం బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతుండగా, రాకీ తన జీవిత భాగస్వామిగా ఆమెకు అన్ని విధాలా మద్దతుగా ఉంటున్నాడు. ఇటీవల రాకీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ భావోద్వేగ పోస్ట్ చేస్తూ కొన్ని ఫోటోలు, వీడియోలు షేర్ చేశాడు.

ఈ పోస్ట్ ద్వారా, హీనాకు రాకీ ఎలా సపోర్ట్ చేస్తోన్నాడో స్పష్టమవుతుంది. హీనా కూడా ఈ సందర్భంగా చాలా ఎమోషనల్ అయ్యింది. “ప్రతి మహిళా తన జీవితంలో ఇలాంటి మగవాడిని కలవాలి. నా గుండు చేయించుకున్నప్పుడు అతడూ గుండు చేయించుకున్నాడు. నాకు వెంట్రుకలు పెరిగినప్పుడు మాత్రమే తన జుట్టు పెరగనిస్తానని చెప్పాడు. అతడు నన్ను నిస్వార్థంగా ప్రేమిస్తాడు” అని ఆమె తెలిపింది.

“కష్ట కాలంలో మేమిద్దరం ఒకరికొకరు బలంగా నిలిచాం. తండ్రులను కోల్పోయిన బాధను, ఆరోగ్య సవాళ్లను కలిసి ఎదుర్కొన్నాం. నాకే కాకుండా నా చుట్టూ రక్షణ కవచాన్ని సృష్టించాడు. నా ట్రీట్‌మెంట్ సమయంలో నాకు కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. అతడు నాకు ఒక గైడ్‌గా మారాడు” అని హీనా చెప్పుకొచ్చింది.

https://www.instagram.com/p/DFQ2sFNoWf1/?utm_source=ig_web_copy_link

Releated Posts

ఈడీ నోటీసులు.. మహేష్ బాబు విచారణకు హాజరవుతారా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్,…

ByByVedika TeamMay 12, 2025

విజయ్ కుమారుడు.. అఖిల్‌తో కలిసిన ఫోటో వైరల్! భారీ ప్రాజెక్ట్‌పై ఊహాగానాలు…!!

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే…

ByByVedika TeamMay 10, 2025

సమంత “న్యూ బిగినింగ్స్” ఫొటోల వెనుక రహస్యం: రాజ్‌ నిడిమోరుతో సంబంధం?

సమంత ఇటీవల “న్యూ బిగినింగ్స్” అనే క్యాప్షన్‌తో పలు ఫొటోలు షేర్ చేయగా, అందులో దర్శకుడు రాజ్‌ నిడిమోరు కనిపించడంతో నెటిజన్ల దృష్టి అక్కడికి…

ByByVedika TeamMay 9, 2025

రజనీకాంత్ ‘కూలీ’ పారితోషికం షాకింగ్: 260 కోట్లు రెమ్యునరేషన్.. నాగార్జున, ఆమిర్ ఖాన్‌కి ఎంతంటే?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న ‘కూలీ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ డైరెక్టర్…

ByByVedika TeamMay 8, 2025

Leave a Reply