• Home
  • Entertainment
  • “మంచు లక్ష్మి వారు నాతో దురుసుగా ప్రవర్తించారు”….ఇండిగోపై తీవ్ర ఆగ్రహం
Image

“మంచు లక్ష్మి వారు నాతో దురుసుగా ప్రవర్తించారు”….ఇండిగోపై తీవ్ర ఆగ్రహం

టాలీవుడ్ ప్రముఖ నటి మంచు లక్ష్మి ఇండిగో విమానాయాన సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె సోషల్‌ మీడియా వేదికగా, ఇండిగో సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం గురించి ట్వీట్‌ చేసిన మంచు లక్ష్మి, తన పోస్టులకు ఇండిగో ఎయిర్ లైన్స్‌ను కూడా ట్యాగ్ చేసింది.

ఆమె పేర్కొన్నది, “నా లగేజ్‌ బ్యాగేజ్‌ను పక్కకు తోసేశారు. కనీసం నా బ్యాగ్‌ను ఓపెన్‌ చేసేందుకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్లు చెప్పింది వినకపోతే నా బ్యాగును గోవాలోనే వదిలేస్తామన్నారు. ఇది చాలా దారుణం. ఇండిగో సిబ్బంది చాలా దురుసుగా ప్రవర్తించారు. ఇంకా పచ్చి నిజం మాట్లాడుకోవాలంటేవేధించారు. చివరకు నా లగేజీకి సెక్యూరిటీ ట్యాగ్‌ కూడా వేయలేదు. ఒకవేళ అందులో ఏదైనా వస్తువు మిస్‌ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా? ఇంత నిర్లక్ష్యంగా ఎయిర్‌లైన్స్‌ను ఎలా నడపగలుగుతున్నారు?” అంటూ వరుస ట్వీట్స్ చేసింది.

మంచు లక్ష్మి తన పోస్టుల్లో, తన బ్యాగుకు కనీసం లాక్‌ వేయలేదని, ట్యాగ్‌ కూడా వేయలేదని వీడియోలు షేర్‌ చేసింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఈ పోస్టులు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇండిగో విమానాయాన సంస్థ ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

మంచు లక్ష్మి, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు వారసురాలిగా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. నటిగా, సింగర్‌గా, నిర్మాతగా, యాంకర్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఆమె, ఇటీవల వరుస సినిమాల్లో పాల్గొనడం తగ్గించి, తన నివాసాన్ని ముంబైలో షిఫ్ట్ చేసుకుంది. కానీ తన సామాజిక సేవా కార్యక్రమాల కోసం తరచూ హైదరాబాద్‌ వస్తూ ఉంటారు.

Releated Posts

మహేష్ బాబు చేయాల్సిన సినిమా దక్కించుకున్న రామ్ చరణ్…!!

సినీ పరిశ్రమలో ఒక కథ మరో హీరోకి వెళ్ళడం సాధారణమే. కానీ కొన్నిసార్లు అది ఒకరి కెరీర్‌ను మలుపు తిప్పే విధంగా మారిపోతుంది. అలాంటి…

ByByVedika TeamApr 19, 2025

షైన్ టామ్ చాకో అరెస్ట్ – డ్రగ్ కేసులో కీలక మలుపు..!!

ప్రముఖ నటుడు మరియు ‘దసరా’ విలన్‌ షైన్ టామ్ చాకో ఇటీవల వార్తల్లో హాట్ టాపిక్ అయ్యారు. రెండు రోజులుగా హోటల్ నుంచి తప్పించుకుని…

ByByVedika TeamApr 19, 2025

కేఎల్ రాహుల్ కుమార్తెకు నామకరణం: “ఇవారా” అర్థం ఏమిటి?

భారత క్రికెట్ స్టార్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి గత ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మార్చి 24న వీరిద్దరికీ ఓ…

ByByVedika TeamApr 18, 2025

మ్యాడ్ స్క్వేర్ థియేటర్ హిట్‌ తర్వాత ఓటీటీలోకి..??

చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సాధించిన సినిమాల్లో మ్యాడ్ ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. దర్శకుడు కళ్యాణ్ శంకర్ రూపొందించిన ఈ యువతరానికి…

ByByVedika TeamApr 18, 2025

Leave a Reply