సూపర్ స్టార్ మహేష్ బాబు తన కొత్త సినిమా కోసం రెడీ అవుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాల తర్వాత రాజమౌళి మరోసారి గ్లోబల్ ప్రాజెక్ట్‌కు సిద్ధమయ్యారు.
మహేష్ బాబు అభిమానులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొట్టేలా ఉండనుందని అంటున్నారు. ఈ కథ ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఉంటుందని, రామాయణం టచ్ కూడా ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

హీరోయిన్స్ విషయంలో కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. విదేశీ నటి పేరు వినిపించినప్పటికీ, దీపికా పదుకొనె మరియు ప్రియాంక చోప్రా పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. తాజాగా ప్రియాంక హైదరాబాద్‌కు రావడంతో ఆమె మహేష్ సినిమాకు చేరుతున్నట్లు భావిస్తున్నారు.
రాజమౌళి ఈ సినిమా షూటింగ్ కోసం కొన్ని హింట్స్ ఇస్తున్నారు. కెన్యా అడవుల్లో లొకేషన్ల వేట, సింహాన్ని లాక్ చేసినట్టు చేసిన పోస్టులు, సినిమాపై అంచనాలను పెంచాయి. తాజా పోస్టులో సింహాన్ని లాక్ చేసి మహేష్ బాబును పాస్‌పోర్ట్‌తో లింక్ చేశారు. దీనికి మహేష్ బాబు అదిరే రిప్లే ఇచ్చారు. “ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను” అంటూ డైలాగ్ కొట్టారు. ప్రియాంక చోప్రా కూడా “ఫైనల్లీ” అంటూ రిప్లే ఇచ్చారు.
ఈ ఆసక్తికర అంశాలు సోషల్ మీడియాను షేక్ చేస్తూ మహేష్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.