కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్న నటి. “యానిమల్,” “పుష్ప 2” వంటి హిట్స్‌తో తన కెరీర్‌కి మరో మలుపు తీసుకువచ్చింది. తెలుగుతో పాటు హిందీ భాషలో వరుసగా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్‌గా రాణిస్తోంది. ఇటీవల రష్మిక తన జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా కాలికి గాయమైన విషయం తెలిసిందే.

తాజాగా ఆమె నటించిన “చావా” సినిమాలో ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటించగా, రష్మిక మహారాణి యేసుబాయి పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా గురించి మాట్లాడుతూ రష్మిక ఆసక్తికర కామెంట్స్ చేసింది. “ఈ సినిమా ట్రైలర్ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. విక్కీ కౌశల్ దేవుడిలా కనిపించాడు. ‘చావా’ సినిమాతోనే రిటైర్ అవ్వాలనిపించిందని దర్శకుడు లక్ష్మణ్‌తో చెప్పాను” అని రష్మిక తెలిపింది.
ఇప్పుడు రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల్లో హాట్ టాపిక్‌గా మారాయి.