ఈ సారి ఐపీల్ కప్ కొట్టిన కోల్కతా టీం ఈ సారి కూడ సేమ్ ఫీట్ రిపీట్ చేయాలనీ అనుకుంటుంది. దీనికి తగ్గట్టు రిటెన్షన్ లిస్ట్ తయారు చేస్తుంది. గతంలో నలుగురికి మాత్రమే అవకాశం ఉండగా, ఈసారి ఆరుగురికి అవకాశం రావడంతో ఫ్రాంచైజీలకు లాభం చేకూరనుంది. దీని వల్ల కొంతమంది స్టార్ ప్లేయర్‌లు తమ పాత ఫ్రాంచైజీల వద్దే ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో, ఇతర క్రికెట్ స్టార్లు కూడా ఈ వేలంలో పాల్గొంటున్నారు. తాజాగా కలకత్తా రిటెన్షన్ జాబితా గురించి ఆసక్తికరమైన సమాచారం అందింది. గత సీజన్‌లో చాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈ వేలంలో చాలా మంది స్టార్‌లను అట్టిపెట్టుకునే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం, 2023 మినీ-వేలంలో 24.75 కోట్లకు కొన్న మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా ఫ్రాంచైజీ అంటి పెట్టుకునే అవకాశం లేదు. స్టార్క్ 2024 సీజన్ లో స్టార్క్ బాగానే రాణించాడు. 17 వికెట్లతో కోల్ కతా టైటిల్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే తాము చాలా అధిక మొత్తంతో కొనుగోలు చేసినట్టు ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం ఇప్పుడు ఫీల్ అవుతోంది. అందుకే ఈ సారి వేలంలోకి వదిలేసి అవకాశం ఉంటే తక్కువ ధరకే తీసుకునేందుకు సిద్ధమవుతోంది.
కాగా, కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాళ్ల జాబితాలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను అగ్రస్థానంలో చేర్చనుంది. అతనికి 18 కోట్లు చెల్లించి మొదటి రిటైనర్ గా ఉంచుకోవాలని భావిస్తుంది. రింకూ సింగ్‌ను రెండో రిటైనర్ గా 14 కోట్లకు రిటైన్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రింకో గత సీజన్‌లో ఎక్కువ సార్లు బ్యాటింగ్ ఆడలేదు, కానీ అతను ఒక ముఖ్యమైన ఫినిషర్. అందుకే అతన్ని వదులుకోవడానికి సాహసం చేయదు. అలాగే మూడో ఆటగాడిగా విండీస్ ఆల్ రౌండర్ ఆండ్రూ రస్సెల్ ఎంపికయ్యే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం రస్సెల్ కు 11 కోట్లు చెల్లించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, కోల్‌కతా తమ నాలుగో రిటైనర్ గా ఆల్‌రౌండర్ సునీల్ నరైన్‌ను తప్పకుండా ఉంచుకుంటుంది. సునీల్ నరైన్ బౌలింగ్ చేయడమే కాకుండా ఓపెనర్‌గా కూడా ఆడతాడు. గత సీజన్‌లో నరైన్ మూడు అర్ధ సెంచరీలతో పాటు 180కి పైగా స్ట్రైక్ రేట్‌తో 488 పరుగులు చేశాడు. తన బౌలింగ్ తో 17 వికెట్లు తీశాడు.
యువ ఆటగాడు హర్షిత్ రానాను వదులుకునే అవకాశం నైట్ రైడర్స్ కు లేదు. గత సీజన్‌లో కోల్‌కతా విజయాల్లో రానా కీలక పాత్ర పోషించాడు. 13 మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు తీశాడు. నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ అందించిన రైట్ టు మ్యాచ్ ఆప్షన్‌తో హర్షిత్ రానా తిరిగి జట్టులోకి వస్తాడని స్పష్టంగా తెలుస్తోంది. అయితే మిచెల్ స్ట్రార్కు ను ఎంత పెట్టి రిటైన్ చేసుకుంటారో తెలియల్సీ ఉంది. అంతేకాదు, ఐపీఎల్‌కు ఆస్ట్రేలియా క్రికెటర్లు పూర్తిగా అందుబాటులో ఉంటారా అనే ప్రశ్న కూడా ఫ్రాంచైజీలను ఆందోళనకు గురిచేస్తోంది. అంతకు ముందు సీజన్లలో, స్టార్క్ IPL కంటే టెస్ట్ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇచ్చాడు. అయితే వేలంలో అమ్ముడుపోయిన తర్వాత ఈసారి ఐపీఎల్‌లో ఆడకపోతే విదేశీ ఆటగాళ్లు రెండేళ్ల నిషేధానికి గురవుతారు.