ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయాగ్‌రాజ్ కుంభమేళాపై సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారాలను తీవ్రంగా ఖండించారు. సోషల్‌మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన వ్యక్తులపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు.
సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తగా గుర్తించిన లలూ యాదవ్ సంజీవ్ అనే వ్యక్తి కుంభమేళాలో చలి కారణంగా 11 మంది భక్తులు మరణించారని, మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తప్పుడు ప్రచారం చేశాడు. ఈ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయమై యోగి ప్రభుత్వం ఇప్పటికే ప్రజలలో భయాన్నీ, అలజడిని రేకెత్తించే యత్నాలను ఖండిస్తూ తప్పుడు ప్రచారం చేసిన వారికి శిక్ష తప్పదని తెలిపారు.

ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో ప్రస్తుతం కుంభమేళా కొనసాగుతుండగా, భక్తుల తాకిడితో ప్రాంగణం కిటకిటలాడుతోంది. భక్తులు, సాధువులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు సీఎం యోగి పేర్కొన్నారు. 24 గంటల వైద్య శిబిరాలు, అత్యవసర సేవలు అందుబాటులో ఉంచామని వివరించారు.