Vedika Media

Vedika Media

vedika logo

మూసి నది ప్రాజెక్టు పై ముందుకా? వెనక్కా ?

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసి నది పునరజ్జివ ప్రాజెక్టు డైలమాలో పడింది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు వల్ల చాలా కుటుంబాలు తమ ఇండ్లను కోల్పోతున్నాయి. దింతో మూసి భాదితులు తమ ఇండ్లను కోల్పోయేందుకు సిద్ధంగా లేరు. ఒక వైపు మూసి నది బాధితులు మరోవైపు ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజక్టును చేపట్టాలని చూస్తుంది. తెలంగాణ ప్రజా ప్రతినిధులు అదే విధంగా జర్నలిస్టుల బృందం సౌత్ కొరియాకి వెళ్లారు. అక్కడ సియోల్ నగరంలో ఉండే నదిని  పరిశీలించారు. అక్కడ నది ఇరువైపులా ఏ విధంగా డెవలప్ ఐంది. విదేశీ పర్యటికులను ఏ విధంగా ఆకర్షిస్తున్నారు. ఈ విధంగా అన్ని అంశాలను స్టడీ చేయడానికి వెళ్లారు. దీనిని బట్టి మూసి నది సుందరీకరణ ప్రాజెక్ట్ పై ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. 

 

కానీ దీని వెనుక ఉన్న అసలు కారణాలను ప్రతి పక్ష పార్టీ వారు చెబుతున్నారు. ఇదే విషయాన్నీ మాజీ మంత్రి brs పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ కేవలం కర్ణాటక, తెలంగాణ, హిమచల్ ప్రదేశ్ లో మాత్రమే అధికారంలో ఉందని. ఇందులో హిమాచల్ ప్రదేశ్ చాలా చిన్న రాష్ట్రం అని, కర్ణాటకలో సీఎం, డిప్యూటీ సీఎంల మధ్య పోరు నడుస్తుందని అందువల్ల తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఓక ఎటిఎం లాగా వాడుకుంటుందని సంచలన ఆరోపణలు చేశారు. ఇంకా ktr చెబుతూ కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టబోయే లక్ష 50 వేల కోట్లలో 30వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ముడుపులు చెల్లిస్తారని ఆరోపణలు చేశారు. దింతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. 

 

మూసి నది ప్రక్షళన కోసం గత ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులను చేపట్టింది అని brs వర్గాల వారు చెబుతున్నారు. మూసీ నదిపై 14 బ్రిడ్జిల నిర్మాణాలకు అనుమతులిచ్చామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. త్వరలోనే వాటికి శంకుస్థాపన చేయనున్నామని, ఐదు టెండర్ల దశలో ఉన్నాయని ప్రకటించారు. శనివారం నార్సింగిలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్…. శంషాబాద్‌ నుంచి నాగోల్‌ వరకు 55 కిలోమీటర్ల మేర మూసీపై ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మిస్తామన్నారు. ఇందుకు మొత్తం రూ.15 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని చెప్పారు. మూసీ నదిపై స్కైవే నిర్మిస్తామని వివరించారు. తెలిపారు. మూసీ సుందరీకరణ పనులు మరింత వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు.

 

మొత్తానికి మూసి నది సుందరికరణ ప్రాజెక్టు కోసం brs ప్రభుత్వం ఏమి చేసింది? కాంగ్రెస్ ప్రభుత్వం ఎం చేయబోతుంది అనేది చాల ఇంటరెస్టింగ్ గా మారింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మూసి నదికి ఇరువైపుల ఉన్న ఇండ్లను తొలగొంచి వాటి స్థానంలో మల్టీ పర్పస్ హై లెవెల్ బిల్డింగ్స్ కట్టి టూరిజంను డెవలప్ చేయాలనీ చూస్తున్నారు. మొన్న జరిగిన ప్రెస్ మీట్లో కూడ సీఎం రేవంత్ రెడ్డి మూసి నది డెవలప్మెంట్ పై ఒక వీడియో విడుదల చేశారు. 

 

అయితే అందుతున్న సమాచారం మేరకు మూసి నది ప్రాజెక్టు పై ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని సమాచారం. అవసరం అయితే నిర్వాసితులకు మార్కెట్ ప్రకారం పరిహారం ఇచ్చేందుకు కూడ రెడీ అవుతున్నారు అని తెలుస్తుంది. 

Leave a Comment

Vedika Media