గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి అన్ని చోట్లా పాజిటివ్ రివ్యూలు సాధించింది. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో కియారా అద్వానీ, అంజలి ప్రధాన పాత్రల్లో నటించారు. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
సినిమాలో అందరిని ఆకర్షించిన మెలోడీ సాంగ్ ‘నానా హైరానా’ థియేటర్లలో కనిపించకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. దీనిపై గేమ్ ఛేంజర్ టీమ్ వివరణ ఇచ్చింది. సాంకేతిక సమస్యల కారణంగా ఈ పాటను తొలగించినట్లు తెలిపారు. అయితే, ఈ సమస్యను పరిష్కరించి జనవరి 14 నుంచి ఈ పాటను సినిమాకు జోడిస్తామని స్పష్టం చేశారు.

‘నానా హైరానా’ పాట యూట్యూబ్‌లో ఇప్పటికే ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ సాంగ్‌కి తమన్ సంగీతం అందించగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం రాశారు. కార్తిక్, శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాటలో కియారా అందం, రామ్ చరణ్ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.













