• Home
  • Games
  • యుజ్వేంద్ర చాహల్ – ధనశ్రీ విడాకుల పుకార్లపై స్పష్టత: ప్రేమ, అనుమానాలు, ట్రోలింగ్!
Image

యుజ్వేంద్ర చాహల్ – ధనశ్రీ విడాకుల పుకార్లపై స్పష్టత: ప్రేమ, అనుమానాలు, ట్రోలింగ్!

యుజ్వేంద్ర చాహల్ – ధనశ్రీ విడాకుల పుకార్లపై చర్చ

భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మరియు అతని భార్య ధనశ్రీ వర్మ మధ్య ఉన్న అనుమానాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం, చాహల్ తన ఫొటోలును తొలగించడం వంటి చర్యలతో వీరిద్దరూ విడిపోయారనే ఊహాగానాలు చెలరేగాయి.

చాహల్ ప్రకటన

జనవరి 9న చాహల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రకటన విడుదల చేస్తూ, వ్యక్తిగత జీవితంపై అనవసర పుకార్లను వ్యాప్తి చేయవద్దని కోరారు. “నా దేశం, నా జట్టు, నా అభిమానుల కోసం నేను ఇంకా గొప్పగా ఆడాలి,” అని తెలిపారు. వ్యక్తిగత విషయాలపై చర్చలు ఆపాలని విజ్ఞప్తి చేశారు.

ధనశ్రీ ప్రకటన ధనశ్రీ కూడా తనపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ, సోషల్ మీడియాలో ద్వేషంతో తన ప్రతిష్టకు భంగం కలిగించరాదని చెప్పారు. “తన మౌనం బలహీనత కాదని, కష్టపడి ఈ స్థాయికి చేరానని” వివరించారు

విడాకులపై వాస్తవం

చాహల్ ప్రకటనలో తనను కొడుకు, సోదరుడు, స్నేహితుడిగా అభివర్ణించారు కానీ భర్త అని ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ వ్యాఖ్యలు ప్రజలలో మరింత అనుమానాలను రేకెత్తించాయి.

మద్దతు కోరిన చాహల్

“నిజమైన విలువలు, కృషి, నిబద్ధతతో ముందుకు సాగుతాను” అంటూ చాహల్ పేర్కొన్నారు. పుకార్లకు సంబంధించి తన కుటుంబానికి బాధ కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు.

Releated Posts

భారత్-పాక్ కాల్పుల విరమణ అనంతరం ప్రధాని మోదీ ప్రసంగం: ఆపరేషన్ సింధూర్ వివరాలు

భారత్‌-పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో సరిహద్దు రాష్ట్రాల్లో శాంతి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ రాత్రి 8…

ByByVedika TeamMay 12, 2025

విరాట్ కోహ్లి టెస్టులకు గుడ్‌బై – అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటన…

న్యూఢిల్లీ: భారత క్రికెట్ అభిమానులకు ఓ ఆవేదన కలిగించే వార్త. టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు.…

ByByVedika TeamMay 12, 2025

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

భారత్–పాకిస్తాన్ కాల్పుల విరమణలో తిరుగులేని ఉలుపు – మోదీ గట్టి హెచ్చరికతో పాక్ వెనక్కి…!!

భారత్‌, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై అంగీకారం వచ్చిన రెండు రోజులకు, జమ్మూ కశ్మీర్ సహా అంతర్జాతీయ సరిహద్దుల్లో పరిస్థితి చాలా వరకు ప్రశాంతంగా…

ByByVedika TeamMay 12, 2025

Leave a Reply