Vedika Media

Vedika Media

vedika logo

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం…. ఏమి జరగబోతుంది?

నిన్న విడుదల అయిన హర్యానా, జమ్మూ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఊహించిన విధంగా ఫలితాలు రాలేదు అని చెప్పాలి. దీనికి గల కారణాలను కాంగ్రెస్ పార్టీ వారు విశ్లేషించుకునే పనిలో పడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వెనకపడింది అనే దానిపై సీనియర్లు గ్రౌండ్ లెవెల్ లో నుంచి రిపోర్ట్స్ తెప్పిస్తున్నారు. దానికి అనుగుణంగా రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టె అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే త్వరలో జరిగే మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల తరువాత తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనం జరిగే అవకాశం ఉంది. ఈ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం… 

నిన్న విడుదల అయిన హర్యానా ఎన్నికల పలితాలు కాంగ్రెస్ పార్టీ వారిని డిఫెన్స్ లో పడేశాయి. అధికారం వచ్చినట్టే వచ్చి చేజారింది. దింతో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. నిన్న ఉదయం బ్యాండ్ మేళం, టపాసులు వంటివి అన్ని సిద్ధం చేసుకున్నారు. కానీ ఫలితాలకు తేడా కొట్టడంతో బ్యాండ్ మేళం వారు వాయించకుండా వెళ్లిపోయారు. దింతో మనం అర్ధం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ వారు ఎంతగా అధికారం వస్తుందని నమ్మినారో. అయితే ఈ పరాజయం వెనుక కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో 5 గ్యారంటీలు అధికారంలో వచ్చారు. దింతో ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఆపసోపాలు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర పరిస్థితి కూడ అంతే 6 గ్యారంటీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మొత్తానికి హర్యానా ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీకి బల్బ్ వెలిగింది. ఇక్కడ వీళ్ళు 7 గ్యారంటీలు అంటూ అన్ని ఉచిత హామీలు ఇచ్చారు. అసలే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ఉచిత హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక పోతున్నారు. దింతో హర్యానా ఓటర్లను అపోజిషన్ పార్టీ వారు ఈ రెండు రాష్ట్రాలను ఉదాహరణగా చెప్పారు. అంతే కాదు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో హర్యానా వోటర్లకి అపోజిషన్ వారు చెప్పారు. ముఖ్యంగా హైడ్రా వల్ల పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలు తమ ఇండ్లను కోల్పోయారు. అదే విధంగా మూసి నది ప్రాజెక్ట్ బాధితుల నిరసనలు, ఈ రెండు అంశాలు నేషనల్ లెవెల్లో ట్రేండింగ్ అయ్యాయి. దింతో హర్యానా ఓటర్లలలో మార్పు వచ్చి తిరిగి బీజేపీ పార్టీ వారిని పట్టం కట్టారు అని విశ్లేషకులు చెబుతున్నారు. 

తెలంగాణలో సీఎం పట్ల అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ జరిగే అన్ని విషయాలు హై కమాండ్ కు చేరవేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడ తెలంగాణలో జరిగే విషయాలపై అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. రాబోయే ఢిల్లీ, మహారాష్ట్ర ఎన్నికల తరువాత సీఎం మార్పు ఉంటుందని కాంగ్రెస్ పార్టీలో ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్నీ ఏమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఒక మీటింగ్ లో చెప్పారు. దింతో రేవంత్ రెడ్డి మార్పు అంటూ వస్తున్న వార్తలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ వల్ల రేవంత్ రెడ్డి సీఎం కాలేదు, రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని రేవంత్ వర్గీయులు చెబుతున్నారు. మొత్తానికి ఈ పుకార్లు నిజమో కాదో తెలియాలంటే ఢిల్లీ, మహారాష్ట్ర ఎన్నికలు అయ్యే దాకా ఆగవల్సిందే. 

Leave a Comment

Vedika Media