డాకూ మహారాజ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో పలు విషయాలు తెలిపారు. వాటిలో ముఖ్యాంశాలు

- బాలకృష్ణతో వరుస సినిమాలు:
ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ, “బాలకృష్ణ గారితో వరుసగా సినిమా చేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను. అఖండ చిత్రంలో నటించాను. అది నా కెరీర్‌కు మంచి మలుపు ఇచ్చింది.” - డాకు మహారాజ్:
“ఈ చిత్రంలో నేను కావేరి పాత్రను పోషిస్తున్నాను. ఈ పాత్రను పోషించడం సవాల్‌గా భావిస్తున్నాను. బాలకృష్ణ గారు, ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తారు. - దర్శకుడు బాబీ కొల్లి:
“బాబీ గారు అద్భుతమైన దర్శకుడు. ఆయన డైరెక్షన్లో నటించేందుకు అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. సెట్స్‌లో ఆయన మనస్తత్వం, నటీనటులను ఒత్తిడికి గురి చేయకుండా ఆయన స్టేజి నిర్వహించడం నాకు చాలా నచ్చింది.” - బాలకృష్ణ గారితో అనుభవం:
“బాలకృష్ణ గారు ఎంతో అనుభవం ఉన్న నటుడు. ఆయన ఇంకా కొత్త విషయాలను నేర్చుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తారు.” - తమన్ సంగీతం:
“తమన్ గారు ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు. ‘డాకు మహారాజ్’ చిత్రం కోసం రూపొందించిన పాటలు నాకు చాలా నచ్చాయి.” - జనవరి 12 విడుదల:
నా పుట్టినరోజు నాడు విడుదలవున్న ఈ సినిమాకు నాకు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఇది నా పుట్టినరోజుకి ఒక గొప్ప బహుమతి అనుకుంటున్నాను.” - డ్రీం రోల్:
“నా డ్రీం రోల్‌కు సంబంధించిన విషయానికి వస్తే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేయాలనుకుంటున్నాను. ప్రగ్యా జైస్వాల్ బాలకృష్ణతో జతకట్టిన డాకూ మహారాజ్ సంక్రాంతి కానుకగా విడుదల అవుతోంది.















