Vedika Media

Vedika Media

vedika logo

తెలుగు చిత్ర పరిశ్రమ Vs తెలంగాణ ప్రభుత్వం

ఈ మధ్య కొండా సురేఖ ktr ను విమర్శించే క్రమంలో హీరో అక్కినేని నాగార్జున ఫామిలీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఈ విషయాన్ని అక్కినేని నాగార్జునతో పాటు హీరోలు, దర్శకనిర్మాతలు దాదాపు అందరు ఖండించారు. మీ రాజకీయాల కోసం చిత్ర పరిశ్రమను రాజకీయాల్లోకి లాగవద్దు అని కొండా సురేఖకు కౌంటర్లు ఇచ్చారు. దింతో కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా వారు చిత్ర పరిశ్రమను తిడుతూ ట్రోల్స్ చేశారు. అదే విధంగా డ్రగ్ కేసు మళ్ళి రీ ఓపెన్ చేసి అందరిని జైలు కు పంపిస్తామని సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ చేశారు. దీనికి తోడు హైడ్రా ద్వారా మరికొంత మంది ఇండ్లను కూలగొడతారు అని ప్రచారం జరుగుతుంది. ఈ విషయాలన్నీ గమనిస్తున్న కొంత మంది సినిమా పెద్దలు భేటీ అయ్యారు అని ఫిలిం నగర్ సమాచారం. 

 

ఈ భేటీలో సినిమా పరిశ్రమను సొంత రాష్ట్రం అయిన ఆంధ్ర ప్రదేశ్ కి షిఫ్ట్ చేసే విషయంపై చర్చలు జరిగినట్టు సమాచారం. ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా ఇండస్ట్రీ ఏర్పటు చేయాలనీ అక్కడి గవర్నమెంట్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది. వైజాగ్ ఏరియాను సినిమా షూటింగ్ లకి అనువైన ప్రాంతంగా గుర్తించారు. ఇప్పటికే చాల తెలుగు సినిమాలు వైజాగ్ లో షూటింగ్ జరుపుకున్నాయి. రామానాయుడు స్టూడియో కూడ అందుబాటులో ఉంది. మరికొన్ని స్టూడియోలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తుంది, 

 

ఇప్పటికే టాలీవుడ్ నుంచి కొంత మంది ఈ విషయంపై మీడియా ముందు కూడ చెప్పారు. అయితే నిజంగా చిత్ర పరిశ్రమ షిఫ్ట్ అవుతుందా? దీని వల్ల నష్టం ఎవరికీ అనే విషయాలు ఇప్పుడు చూద్దాం…  ఒక సినిమా నిర్మాణం జరిగితే టీ స్టాల్ వాళ్ళ దగ్గర నుంచి ఫైవ్ స్టార్ హెటల్ వరకు అందరికి ఉపాధి దొరుకుతుంది. దీని వల్ల ఎన్నో కుటుంబాలు జీవనం పొందుతాయి. గతంలో చెన్నై నుంచి చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కి షిఫ్ట్ చేయడానికి దాదాపు 15 సంవత్సరాలు పట్టింది. తెలుగు చిత్ర పరిశ్రమ వల్ల తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం వివిధ టాక్స్ ల రూపంలో 5వేల కోట్ల రూపాయలు అందుతున్నాయి. దింతో దాదాపు 3 లక్షల కుటుంబాలు జీవన ఉపాధి పొందుతున్నాయి. అందువల్ల చిత్ర పరిశ్రమ పట్ల అంత కఠిన వైఖరి వద్దు అని మేధావులు చెబుతున్నారు. మొత్తానికి ఇప్పటికిప్పుడు చిత్ర పరిశ్రమ ఇన్ని సౌకర్యాలు ఉన్న హైద్రాబద్ ను వదిలి మరొక రాష్ట్రానికి వెళ్ళదు. కానీ సినిమా పరిశ్రమ పట్ల ఇదే వైఖరి ఉంటె మాత్రం ఫ్యూచర్ లో ఏదైనా జరగవచ్చు అని విశ్లేషకులు అంటున్నారు. 

 

Leave a Comment

Vedika Media