Vedika Media

Vedika Media

vedika logo

ఈ సంవత్సరంలో తెలుగులో అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ మూవీస్……

తెలుగు సినిమా గురించి చెప్పాలంటే బాహుబలికి ముందు బాహుబలికి తరువాత అని చెప్పవచ్చు. ఎందుకంటే బాహుబలి వచ్చే వరకు తెలుగు లో 100 కోట్ల గ్రాస్ సాధించిన సినిమాలు అసలు లేదు. బాహుబలి తరువాత తెలుగు సినిమా పరిధి చాల పెరిగింది. దింతో ఎన్నో సినిమాలు అవలీలగా 100 కోట్లు సాధించాయి. అయితే ఈ సంవత్సరంలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాలు ఒక సారి చూద్దాం… 

 

టాప్ 1 

ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా తెలుగుతో పాటు అన్ని భాషల్లో హిట్ ఐంది. నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అమితాబ్, కమల్ హాసన్ తదితరులు నటించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్లు సాధించింది. అయితే ఇదే ఫ్రాంచైజీ లో మరో కొన్ని సినిమాలు రాబోతున్నాయి. ప్రెసెంట్ ఈ సినిమాకి సంబంధించి పార్ట్ 2 స్క్రిప్ట్ పనులు డెవలప్ చేసే పనిలో ఉన్నారు. 

 

టాప్ 2 

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం దేవర పార్ట్ 1. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. Rrr తరువాత వచ్చిన ఎన్టీఆర్ సినిమా కావడంతో భారీ హైప్ మధ్య రిలీజ్ ఐంది. మొదటి కొంచెం నెగిటివ్ టాక్ వచ్చిన ఆ తరువాత పుంజుకొని సూపర్ హిట్ ఐంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 550 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తెలుగు లో సూపర్ హిట్ ఐంది. హిందీలో పర్వాలేదు అనిపించింది. కానీ మిగతా భాషల్లో ఈ సినిమా యావరేజ్ హిట్ ఐంది. 

 

టాప్ 3 

 

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం హను – మాన్. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. గుంటూరు కారం సినిమాతో థియేటర్ ఇష్యూ వచ్చింది. దీని వల్ల ఈ సినిమాకి భారీ పబ్లిసిటీ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా తెలుగు మరియు హిందీ భాషలలో అడగొట్టింది అని చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 370 కోట్లకు పైగా గ్రాస్ వసులు చేసింది. 

 

టాప్ 4 

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి పండగ కి వచ్చిన ఈ చిత్రం యావరేజ్ గా నిలిచింది. మొదట్లో ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దీనికి తోడు హను – మాన్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమా కోలుకోలేదు. చివరికి ఈ సినిమా సంక్రాంతి సీజన్ వల్ల యావరేజ్ హిట్ గా నిలిచింది. కానీ ottలో ఈ చితం అదరకొట్టింది అని చెప్పాలి. మొత్తానికి ఈ సినిమా నెగిటివ్ టాక్ లో కూడ మహేష్ బాబు స్టార్ డం వల్ల 250 కోట్ల గ్రాస్ రాబట్టింది. కేవలం తెలుగు లో మాత్రమే విడుదల ఐన ఈ సినిమా అన్ని నైజాం తప్ప అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయింది. 

 

టాప్ 5 

సిద్దు జొన్నలగడ్డ కంటే డీజే టిల్లు అంటేనే ప్రేక్షకులకు బాగా పరిచయం. ఎందుకంటే ఈ సినిమాతోనే బాగా ఫేమస్ అయ్యారు. ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా సూపర్ హిట్ ఐంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సమ్మర్ లో థియేటర్లను ఈ సినిమానే కాపాడింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. సిద్దు జొన్నలగడ్డ కెరీర్ లో మొదటి 100 కోట్ల సినిమాగా నిలిచింది. 

 

టాప్ 6 

 

నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం సరిపోదా శనివారం. ఈ సినిమాలో sj సూర్య కీలకమైన పాత్రలో నటించారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకి ఓపెనింగ్ అయితే వచ్చాయి కానీ లాంగ్ రన్ లో నిలబడలేకపోయింది. మొత్తానికి ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ రాబట్టింది. 

 

అయితే గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం సక్సెస్ రేట్ తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఏడాది సమ్మర్ లో మూడు నెలలు సరైన సినిమాలు లేక థియేటర్లు మూత పడ్డాయి. 

 

Leave a Comment

Vedika Media