• Home
  • Andhra Pradesh
  • తొలి ప్రేమ సినిమాకు పవన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Image

తొలి ప్రేమ సినిమాకు పవన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

విజయవాడలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్‌ గ్రౌండ్‌లో జరిగిన 35వ బుక్‌ ఫెయిర్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పుస్తకాలు మ‌నుషుల్లో తీసుకువ‌చ్చే ప‌రివ‌ర్త‌న గురించి చెప్పారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ తన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘తొలి ప్రేమ’ కోసం తన రెమ్యునరేషన్‌ను కూడా గుర్తుచేసుకున్నారు. ఈ సినిమా 1998లో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. తాను తొలిప్రేమ’ కోసం రూ. 15 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నాన‌ని, వెంటనే పుస్తకాలను కొనుగోలు చేయడానికి దుకాణానికి వెళ్లాన‌ని తెలిపారు.

పుస్తకాలు ఎప్పుడూ నాకు విలువైన వస్తువులు. నేను పుస్తకాలు కొనుగోలు చేయడానికి దాదాపు లక్ష, అంతకంటే ఎక్కువ ఖర్చు చేశాన‌ని తెలిపారు. దీనికి సంబంధించిన‌ వీడియో వైరల్‌గా మారింది. పవన్ తాను పుస్తకాలను చ‌ద‌వ‌కుండా ఉండ‌లేన‌ని, కోటి రూపాయలు ఇచ్చినా పుస్త‌క సేకరణ చేస్తూనే ఉంటాన‌ని, పుస్తకాన్ని విడిచిపెట్టే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. ఎవరైనా నాద‌గ్గ‌రున్న పుస్తకం అడిగితే, వారికి ఒక పుస్త‌కం కొనుక్కోండ‌ని చెబుతాన‌ని అన్నారు. వర్క్ ఫ్రంట్‌లో పవన్ కళ్యాణ్ మార్చిలో ‘హరి హర వీర మల్లు సినిమాలో క‌నిపించ‌నున్నారు. ఇది పీరియాడిక్ సాగా యాక్షన్, రొమాన్స్‌తో లోడ్ అయిన సినిమా. ‘ఓజీ’, ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ త‌దిత‌ర‌ సినిమాలు కూడా ప‌వ‌న్‌ చేతిలో ఉన్నాయి.

Releated Posts

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు: ఎండలు, వడగాలులు, వర్షాలతో ప్రజలు అలసట…

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. ఒక వైపు ఎండ వేడి, ఉక్కబోత ప్రజలను వేధిస్తుండగా, మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో…

ByByVedika TeamMay 10, 2025

ఆంధ్రప్రదేశ్ ఈ-క్యాబినెట్ కీలక నిర్ణయాలు | చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి ప్రణాళికలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన ఈ-క్యాబినెట్ సమావేశంలో పలు అభివృద్ధి చర్యలపై మంత్రి మండలి కీలక నిర్ణయాలు…

ByByVedika TeamMay 9, 2025

పాక్ ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ వైరస్ దాడి – భారత్ అప్రమత్తం..

భారత్ – పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న క్రమంలో, పాకిస్తాన్ కుతంత్రాలకు భారత సాయుధ దళాలు దిమ్మ తిరిగే మాస్టర్ ప్లాన్స్‌తో సమాధానం…

ByByVedika TeamMay 9, 2025

Leave a Reply