ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ ప్రకటించింది. 2025 సంవత్సరంలో మొత్తం 18 శాఖల్లో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో అటవీ శాఖ, దివ్యాంగుల సంక్షేమ శాఖ, ఫ్యాక్టరీ సర్వీసెస్, బీసీ వెల్ఫేర్, జైళ్లు, రవాణా శాఖ వంటి ముఖ్యమైన విభాగాలు ఉన్నాయి.
జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఏపీపీఎస్సీ ద్వారా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్యాలెండర్లో కొత్త పోస్టుల వివరాలతోపాటు, ఇప్పటికే విడుదల చేసిన 20 నోటిఫికేషన్ల పరీక్షా తేదీలు ప్రకటించనుంది.
ముఖ్యమైన వివరాలు:
- మొత్తం భర్తీ చేయనున్న పోస్టులు: 866
- కొత్తగా జారీ చేసే నోటిఫికేషన్లు: 18
- అటవీ శాఖ పోస్టులు: 814
ముఖ్య నోటిఫికేషన్లు:
- దివ్యాంగుల సంక్షేమ శాఖ: వార్డెన్ పోస్టులు
- గనుల శాఖ: రాయల్టీ ఇన్స్పెక్టర్
- పర్యావరణ శాఖ: ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్, ఎనలిస్టు గ్రేడ్-2
- ఎన్టీఆర్ వర్సిటీ: అసిస్టెంట్ లైబ్రేరియన్, జూనియర్ అసిస్టెంట్
- అటవీ శాఖ: ఫారెస్ట్ రేంజి ఆఫీసర్
- రవాణా శాఖ: ఏఎంవీఐ పోస్టులు
పరీక్షా తేదీలు:
- గ్రూప్ 1 మెయిన్స్: 2025 ఏప్రిల్ తర్వాత
- గ్రూప్ 2 మెయిన్స్: 2025 ఫిబ్రవరి 23
- లెక్చరర్ పోస్టులు (పాలిటెక్నిక్/డిగ్రీ కళాశాలలు): 2025 జూన్
- ఇతర పోస్టుల పరీక్షలు: మార్చి చివరి నుంచి జూన్ వరకు