టాలీవుడ్ బ్యూటీ సమంతకు సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో సమంత బేబీ బంప్‌తో కనిపించడంతో నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు.
గతంలో నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా సమంత తన కెరీర్‌పై దృష్టి సారించింది. తనకు మాతృత్వం అనుభవించాలనే కోరిక ఉందని ఆమె పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించింది. ఈ నేపథ్యంలో తాజాగా వైరల్ అవుతున్న ఫోటోలు సమంత అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
అయితే, నిజానికి ఈ ఫోటోలు అసలు సమంతవి కావు. ఎవరో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికతను ఉపయోగించి ఈ ఫోటోలను సృష్టించారు. గతంలో కూడా సమంత ప్రెగ్నెంట్ అనే వదంతులు వచ్చాయి.