మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (92) గురువారం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో తుది శ్వాస విడిచారు. వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన్ని ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతిచెందారు.
మన్మోహన్ సింగ్ మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. భారతదేశానికి 14వ ప్రధానమంత్రిగా సేవలందించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా ప్రత్యేక గుర్తింపు పొందారు.
మన్మోహన్ సింగ్ జీవిత విశేషాలు
జననం: సెప్టెంబర్ 26, 1932, పశ్చిమ పంజాబ్‌లోని గాహ్ గ్రామంలో (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది).
విద్యాభ్యాసం: పంజాబ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్.
సేవా కాలం: 1971లో విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా ప్రారంభమై, రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ గవర్నర్ వంటి అనేక కీలక పదవులు చేపట్టారు.
ప్రధానమంత్రి పదవి: 2004 నుండి 2014 వరకు యుపీఏ హయాంలో రెండు పర్యాయాలు ప్రధానిగా సేవలందించారు.
ప్రధాన పాత్ర
పీవీ నరసింహరావు కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పని చేసి, దేశ ఆర్థిక సంస్కరణల అమలులో కీలక పాత్ర పోషించారు.