నాగార్జున, “హైదరాబాద్‌ను వరల్డ్ సినిమాల హబ్‌గా మార్చాలి, ఇందులో ప్రభుత్వ సాయం చాలా కీలకం” అని పేర్కొన్నారు. దిల్ రాజు FDC చైర్మన్‌గా నియమించబడడం గురించి స్వాగతం తెలిపారు.
సురేష్ బాబు మాట్లాడుతూ, “హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్‌గా అభివృద్ధి చేయాలని మా డ్రీమ్” అని చెప్పారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ, “హైదరాబాద్‌కు సినిమా పరిశ్రమ రావడంలో మర్రిచెన్నారెడ్డి, అక్కినేని పాత్ర ప్రధానంగా నిలిచింది” అని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి, ఈ భేటీ సందర్భంగా, “సినిమా పరిశ్రమకు పూర్తి మద్దతు ఇవ్వాలనే మా ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని తెలిపారు.
మురళీ మోహన్ కూడా, “సినిమా రిలీజ్ మరియూ ప్రమోషన్‌లో కాంపిటిషన్ కీలకం” అని చెప్పారు.