Vedika Media

Vedika Media

vedika logo

ట్రాన్స్ జెండర్లకు గౌరవప్రదమైన ఉద్యోగాలు కల్పించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగాలు కల్పించడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. గతంలో ట్రాన్స్ జెండర్లు ట్రాఫిక్ సిగ్నల్ ల వద్ద వాహనదారుల దగ్గర డబ్బులు వసూలు చేసేవారు. అయితే ఇప్పుడు అదే ట్రాఫిక్ సిగ్నల్ ల వద్ద ట్రాన్స్ జెండర్లు ట్రాఫిక్ డ్యూటీ చేస్తున్నారు.

ట్రాన్స్ జెండర్లకు శిక్షణ ఇవ్వడంతో పాటు, వారిని హోంగార్డు స్థాయి ఉద్యోగాల్లో నియమించి, సమాజంలో గౌరవప్రదమైన జీవితం సాగించేందుకు అవకాశాలు కల్పించారు. శారీరక మార్పుల కారణంగా కుటుంబం మరియు సమాజం వారి పట్ల చిన్న చూపు చూసేది. అయితే సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన ఈ సరికొత్త నిర్ణయం ద్వారా వారికి గుర్తింపు తీసుకురావడం లక్ష్యం.

హైదరాబాద్ సిపి సీవీ ఆనంద్ మాట్లాడుతూ, ట్రాన్స్ జెండర్లకు శిక్షణ పూర్తిచేసి, ట్రాఫిక్ విభాగంలో మొదటి విధులు అప్పగించామని చెప్పారు. అంకిత భావంతో పనిచేస్తే రానున్న రోజుల్లో ఇతర శాఖల్లోనూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే, ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణను ఆదర్శంగా తీసుకుని ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని తెలిపారు.

ట్రాన్స్ జెండర్లకు గౌరవప్రదమైన జీవితం, సరైన అవకాశాలు కల్పించడంలో ఈ నిర్ణయం చరిత్రాత్మకం అవుతుందని భావిస్తున్నారు.

Leave a Comment

Vedika Media