సహజ అందంతో పాటు అసాధారణ నటనతో కోట్లాది అభిమానుల మనసు దోచుకున్న నటి సాయి పల్లవి మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆమె అమరన్ చిత్రంలో ‘ఇందు రెబెకా వర్గీస్’ పాత్రకు గానూ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది.
చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్:
తమిళనాడు ప్రభుత్వ సహకారంతో ప్రతీ ఏటా నిర్వహించబడే ఈ వేడుక దేశీయ, అంతర్జాతీయ సినిమాలను ప్రత్యేకంగా ప్రదర్శిస్తుంది. 22వ సంవత్సరానికి చెందిన ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ఈసారి డిసెంబర్ 12న ప్రారంభమై డిసెంబర్ 19 వరకు జరిగింది.
ఈ ఏడాది మొత్తం 180 సినిమాలు ప్రదర్శించగా, ప్రముఖ కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి ‘మహారాజా’ సినిమాకు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు.
సాయి పల్లవి స్పందన:
“చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటిగా అవార్డు పొందడం చాలా గర్వకారణంగా ఉంది. అమరన్ చిత్రంలో ముకుంద్ కుటుంబసభ్యుల జీవితం ఆధారంగా రూపొందిన ఈ కథ నా హృదయానికి ప్రత్యేకంగా ఉంది. నా అభిమానుల ప్రేమ నా విజయాలకు మూలం” అని సాయి పల్లవి పేర్కొన్నారు