బాసర :ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, ఒత్తిడి – కారణం ఏదైనా చాలా మంది బాసర గోదావరి వంతెన వద్ద ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఏడాది మాత్రమే 22 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల కీలక చర్యలు తీసుకుంటున్నారు.
గత ఐదేళ్లలో గోదావరి వంతెన దురదృష్టకరంగా ఆత్మహత్యల కేంద్రంగా మారింది. 108 మంది ఆత్మహత్యలకు పాల్పడగా, 86 మందిని స్థానికులు కాపాడారు. అర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి – ఇవన్నీ ఆత్మహత్యలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
ఎస్పీ జానకి షర్మిల చర్యలు:
సీసీ కెమెరాలు: గోదావరి వంతెనపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సమీప పోలీస్ స్టేషన్లకు అనుసంధానం చేస్తున్నారు.
వీధి దీపాలు: రాత్రి సమయంలో ప్రమాదాలను నివారించేందుకు వీధి దీపాలను ఏర్పాటు చేయనున్నారు.
రక్షణ గోడలు: వంతెనకు ఇరువైపులా ఎత్తైన కంచెలు ఏర్పాటు చేయనున్నారు.
పోలీస్ ఔట్ పోస్టు: నది వద్ద పోలీస్ ఔట్ పోస్టును ఏర్పాటు చేసి నిఘా పెంచుతున్నారు.
స్థానికుల సహకారం: గంగపుత్రులు, యువకులతో సమన్వయం సాధించి ప్రాణాలను కాపాడటానికి మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
భవిష్యత్తు దిశగా:
బాసర గోదావరి వంతెన ఇకపై ఆత్మహత్యలకు కాదు రక్షణకు కేరాఫ్ అడ్రస్‌గా మారాలని ఎస్పీ జానకి షర్మిల స్పష్టం చేశారు.