• Home
  • Movie
  • ప‌వ‌న్ కోసం ప్ర‌పంచంలో అంత‌మంది వెదికారా?
Image

ప‌వ‌న్ కోసం ప్ర‌పంచంలో అంత‌మంది వెదికారా?

కొద్ది రోజుల్లో 2024కు గుడ్ బై చెప్పేసి 2025కు వెల్కమ్ చెప్పబోతున్నాం. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘటనలు జరిగాయి. సినిమా ఇండస్ట్రీలో కూడా ఎన్నో వింతలు, విశేషాలు జరిగాయి. ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన నటులు, నటీమణుల జాబితాను గూగుల్ విడుదల చేసింది. విశేషమేమిటంటే.. ఈ ఏడాది ప్రపంచంలో అత్యధికంగా సెర్చ్ చేసిన నటుల జాబితాలో హీరో టాలీవుడ్ టాప్ 2లో ఉన్నారు. ఆయనే పవన్ కళ్యాణ్. గూగుల్ విడుదల చేసిన జాబితాలో ఈ ఏడాది ఎక్కువ మంది సర్చ్ చేసిన నటుల్లో పవన్ రెండో స్థానంలో నిలిచారు.

జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఈసారి ఆంధ్రా అసెంబ్లీ ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేశారు. ఎన్నికల వరకు రోజూ వార్తల్లో నిలిచారు పవన్ కళ్యాణ్.. ఎన్నికల ఫలితాల తర్వాత గెలిచి ఆంధ్రప్రదేశ్ డీసీఎం అయ్యి మళ్లీ వార్తల్లో నిలిచారు. దాంతో చాలా మంది గూగుల్‌లో పవన్ కళ్యాణ్ గురించి రెగ్యులర్‌గా సెర్చ్ చేశారు, ఇప్పుడు ఆ లిస్ట్‌లో పవన్ కళ్యాణ్ రెండవ స్థానంలో ఉన్నారు. గ్లోబల్ లిస్ట్‌లో మరో ఇద్దరు భారతీయ నటీమణులు ఉన్నారు. ఈ జాబితాలో నటి హీనా ఖాన్ పేరు ఐదో స్థానంలో ఉంది. హినా ఖాన్ బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతోంది. దాంతో ఆమె ఇటీవల వార్తల్లో నిలిచారు. దస్వీ’, ‘ఎయిర్‌లిఫ్ట్‌’ సహా పలు సినిమాల్లో నటించిన నిమ్రత్ కౌర్ కూడా అత్యధికంగా సెర్చ్ చేసిన జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారని, ఈ విడాకులకు నిమ్రత్ కౌర్ కారణమని పుకార్లు వచ్చాయి.

Releated Posts

ఈడీ నోటీసులు.. మహేష్ బాబు విచారణకు హాజరవుతారా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్,…

ByByVedika TeamMay 12, 2025

విజయ్ కుమారుడు.. అఖిల్‌తో కలిసిన ఫోటో వైరల్! భారీ ప్రాజెక్ట్‌పై ఊహాగానాలు…!!

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే…

ByByVedika TeamMay 10, 2025

సమంత “న్యూ బిగినింగ్స్” ఫొటోల వెనుక రహస్యం: రాజ్‌ నిడిమోరుతో సంబంధం?

సమంత ఇటీవల “న్యూ బిగినింగ్స్” అనే క్యాప్షన్‌తో పలు ఫొటోలు షేర్ చేయగా, అందులో దర్శకుడు రాజ్‌ నిడిమోరు కనిపించడంతో నెటిజన్ల దృష్టి అక్కడికి…

ByByVedika TeamMay 9, 2025

రజనీకాంత్ ‘కూలీ’ పారితోషికం షాకింగ్: 260 కోట్లు రెమ్యునరేషన్.. నాగార్జున, ఆమిర్ ఖాన్‌కి ఎంతంటే?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న ‘కూలీ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ డైరెక్టర్…

ByByVedika TeamMay 8, 2025

Leave a Reply