వేణు స్వామి .. సినిమా సెలబ్రెటీల జాతకాలు చెప్పడం, రాజకీయనాయకుల జాతకాలు చెప్పడంతో చాలా పాపులర్ అయ్యారు . సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యాడు. సెలబ్రిటీల జాతకాలను చెప్పనంటూ కొన్ని నెలల క్రితం సంచలన ప్రకటన చేసిన వేణు స్వామీ.. మొన్నామధ్య నాగ చైతన్య- శోభిత ధూళిపాళ్ల వైవాహిక బంధంపై జోస్యం చెప్పారు. దీంతో అక్కినేని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టు సంఘాలు కూడా స్వామీజీ పై ఫైర్ అయ్యాయి. మహిళా కమిషన్‌కి ఫిర్యాదు చేశాయి. దీంతో వేణు స్వామి కొన్ని రోజులు సైలెంట్ అయ్యారు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ముందు ప్రత్యక్షం అయ్యారు.
దానిలో అల్లు అర్జున్ అరెస్ట్ గురించి కూడా మాట్లాడారు. అంతే కాదు తన పై విమర్శలు చేసినందుకే ఇండస్ట్రీ చిక్కుల్లో పడిందన్నారు. ఈ గురువుగారు. 2025 మార్చ్ నుంచి రాజకీయాల్లో పెను సంచలనాలు జరగనున్నాయన్నారు. ఓ స్టార్ హీరో కన్వెన్షన్ కూల్చేయడం.. ఓ పెద్ద దర్శకుడు.. భారతదేశానికే పేరు తెచ్చిన డైరెక్టర్ ను టార్చర్ చేయడం, పాన్ ఇండియా హీరోను జైల్లో పెట్టడం. 70ఏళ్ల చరిత్ర ఉన్న నటుడి ఇంట్లో గొడవలు.. ఇవన్నీ తనను కెలికినందుకే జరిగాయని వేణుస్వామి చెప్పకనే చెప్పారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా అల్లు అర్జున్ సీఎం అవుతారని వేణు స్వామి కామెంట్స్ చేశారు.