తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పరీక్షలు 2025 మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించనున్నారు. తెలంగాణ విద్యాశాఖ ఈ షెడ్యూల్ గురువారం (డిసెంబర్ 19) విడుదల చేసింది.

2025 పదో తరగతి పబ్లిక్ పరీక్షల పూర్తి షెడ్యూల్:
- మార్చి 21: ఫస్ట్ లాంగ్వేజ్
- మార్చి 22: సెకెండ్ లాంగ్వేజ్
- మార్చి 24: ఇంగ్లీష్
- మార్చి 26: మ్యాథమెటిక్స్
- మార్చి 28: ఫిజికల్ సైన్స్
- మార్చి 29: బయోలాజికల్ సైన్స్
- ఏప్రిల్ 2: సోషల్ స్టడీస్
పరీక్షలు గతంలో మాదిరిగానే 80% మార్కులకు జరగనుండగా, 20% మార్కులు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నుంచి కలపనున్నారు. 2025-26 నుంచి పబ్లిక్ పరీక్షలు 100 మార్కులకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది.
ఈ ఏడాది నుంచి పరీక్ష ఫలితాలను మార్కుల రూపంలో ప్రకటించనున్నారు. గతంలో ఉన్న గ్రేడింగ్ విధానాన్ని ఎత్తివేసి మార్కులను స్పష్టంగా ప్రదర్శించనున్నారు.












