Vedika Media

Vedika Media

vedika logo

సంధ్య థియేటర్ తొక్కిసలాట: అల్లు అరవింద్ ఆసుపత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించారు

తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. డిసెంబర్‌ 4న రాత్రి ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఈ ఘటనలో రేవతి అనే 39 ఏళ్ల మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆమె కుమారుడు, 9 ఏళ్ల శ్రీతేజ్‌ తీవ్ర గాయాలతో సికింద్రాబాద్ కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

గత రెండు వారాలుగా శ్రీతేజ్‌ పరిస్థితి మెరుగుపడకపోవడంతో, సినిమా నిర్మాత మరియు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్‌ బాలుడి ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు కిమ్స్‌ ఆసుపత్రికి వెళ్లారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌ అక్కడే ఉన్న బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అదేవిధంగా, డాక్టర్లతో మాట్లాడి శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు.

ఈ ఘటనలో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత కోర్టు మరియు జైలు ఇలా అనేక పరిణామాలు సంచలనంగా మారాయి.

Leave a Comment

Vedika Media