తెలంగాణలోని కరీంనగర్ సమీపంలోని కొండలలో ఉండే కోతులన్నీ నగరంలోకి ప్రవేశించాయి…ఇప్పుడు వాడవాడలా వాటి సంఖ్య పెరిగిపోయింది. భగత్ నగర్ ,తిరుమలనగర్, లక్ష్మీనగర్ ,హౌజింగ్ బోర్డు కాలనీలలో వీటి సంచారం అధికంగా ఉంది. లక్ష్మీనగర్ లో ఇళ్ల గేట్ల పైనే కోతులు తిష్టవేసి జనాన్ని ఎటూ వెళ్ళాకుండా భయపెట్టిస్తున్నాయి.
కోతులను నివారంచేందుకు గతంలో కొందరు కొన్ని రోజులు కొండముచ్చును తిప్పారు. దీంతో కోతుల నుంచి తాత్కలిక విముక్తి లభించింది. అయితే అ కొండముచ్చును మెయింటనెన్స్ చేయ కష్టంగా మారడంతో దానిని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఆ దరిమిలా కొండముచ్చు ఫ్లేక్సీలను ఏర్పాటు చేయాలని లక్ష్మీనగర్ వాసులు నిర్ణయించి, కొండముచ్చు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో గత వారం రోజుల నుండి కోతుల సంచారం తగ్గింది. ఈ కొండముచ్చు బొమ్మలు కూడ కోతిని భయపెట్టె విధంగానే అహాభావాలు కలిగి ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు.