హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్‌ను నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించి, కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై అరవింద్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ రెండు వారాలుగా కిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్ ఆరోగ్యం విషమంగానే ఉందని కిమ్స్ వైద్యులు వెల్లడించారు. ఐసీయూలో వెంటిలెటర్‌పై బాధితుడు ఉన్నట్లు చెప్పారు. మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదని, బాధిత బాలుడిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. బాలునికి ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నామని తెలిపారు.