Vedika Media

Vedika Media

vedika logo

మోదీ, అదానీలు దేశం పరువు తీశారు: సీఎం రేవంత్ రెడ్డి

దేశ ప్రధాని మోదీ, బీజేపీల‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 75 ఏళ్లుగా దేశ ప్రతిష్ఠను కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటూ వ‌చ్చింద‌ని, ప్రధాని మోదీ, అదానీలు క‌ల‌సి దేశ పరువు తీసేశారని రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. అదానీ అవినీతిని ప్ర‌దాని మోదీ ఎందుకు ప్రశ్నించడం లేదని రేవంత్ రెడ్డి అడిగారు. అదానీపై ఆరోపణలు, మణిపూర్ అల్లర్ల అంశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు ఛలో రాజ్ భవన్ చేపట్టారు. రాజ్ భవన్ సమీపంలో సీఎం భైఠాయించి నిరసన తెలిపారు.

దేశ పరువును మంటకలిపిన అదానీపై విచారణ జరపాలని రేవంత్ డిమాండ్ చేశారు. భారతదేశంలోని వ్యాపార సంస్థలు అవినీతిలో కూరుకుపోయాయని ఆయ‌న ఆరోపించారు. అదానీ సంస్థలు అగ్ర‌రాజ్యం అమెరికాలో లంచాలు ఇవ్వజూపాయని, దీనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎఫ్బీఐ నివేదించడంతో అమెరికా ప్రభుత్వం చర్యలకు ఉప‌క్ర‌మించింద‌ని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

అదానీ అవినీతిపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని రేవంత్ అన్నారు. అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీకి బీఆర్ఎస్ నేతలు లొంగిపోయారని… అందుకే వారు అదానీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదని విమర్శించారు. అదానీ అవినీతిపై జేపీసీ కోసం లోక్ సభలో ఏకగ్రీవ తీర్మానం చేయాల్సి ఉంద‌ని అన్నారు.

Leave a Comment

Vedika Media