క్యాన్సర్.. ప్రపంచంలోనే ప్రమాదకరమైన వ్యాధి.. ఈ పేరు వినగానే అందరిలో తెలియని భయం మెదులుతుంది. దీనికి కారణం క్యాన్సర్ అత్యంత ఖరీదైన చికిత్స కావడం. పైగా సరైన మందు లేకపోవడం. ఇవి అందర్నీ కలచి వేస్దాయి. అయితే ఇకపై ఎవరూకూడా క్యాన్సర్ విషయంలో ఆందోళన పడవలసిన అవసరం లేదు. క్యాన్సర్ బాధితుల ప్రాణాలను కాపాడేందుకు రష్యా నూతనంగా ఒక వ్యాక్సిన్ తయారు చేసింది. రష్యాలోని ప్రజలకు ఉచితంగా ఈ వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. ఈ వ్యాక్సిన్‌ను క్యాన్సర్ రోగుల చికిత్సకు వినియోగించనున్నారు.
క్యాన్సర్ వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన వివరాలను రష్యా వార్తా సంస్థ టాస్ వివరించింది. ఈ వ్యాక్సిన్‌ను 2025 ప్రారంభంలో విడుదల చేస్తారని సమాచారం. రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ ఆండ్రీ కప్రిన్, క్యాన్సర్‌కు వ్యతిరేకంగా రష్యా తన స్వంత వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. ఈ వ్యాక్సిన్‌ను రోగులకు ఉచితంగా అందజేయనున్నారు. క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రీ-క్లినికల్ ట్రయల్స్ క్యాన్సర్ పెరుగుదల, వ్యాప్తిని నిరోధిస్తుందని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ డైరెక్టర్ వెల్లడించారు.
ఈ వ్యాక్సిన్ ఏ రకమైన క్యాన్సర్‌కు చికిత్స అందిస్తుందో ఇంకా స్పష్టంగా వెల్లడికాలేదు. ఇది క్యాన్సర్ రోగుల ప్రాణాలను ఎలా కాపాడుతుందనే దానితోపాటు ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ పేరు కూడా ఇంకా తెలియరాలేదు. ఇతర దేశాలు కూడా ఇటువంటి ప్రాజెక్టులపై పనిచేస్తున్నాయి. క్యాన్సర్ చికిత్సకు బ్రిటిష్ ప్రభుత్వం జర్మన్ కంపెనీ బయోఎన్‌టెక్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాక్సిన్ తయారీకి రష్యా ఎంతో దగ్గరగా ఉందని చెప్పారు. ప్రస్తుతం వ్యాక్సిన్ ట్రయల్ వర్క్ చివరి దశలో ఉందని తెలుస్తోంది.