Vedika Media

Vedika Media

vedika logo

తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం: కీలక బిల్లులు, పర్యాటక విధానంపై చర్చ

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు శాసన మండలి, శాసనసభ ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. స్పోర్ట్స్, తెలంగాణ వర్సిటీ సవరణ బిల్లులతో పాటు టూరిజం పాలసీపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.

ఈ సమావేశంలో ROR, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లులపై చర్చించనున్నారు. పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలతో, ఇద్దరికి మించి పిల్లలున్న వారు కూడా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించాలని ప్రతిపాదనలు వెలువడుతున్నట్లు సమాచారం.

రైతు భరోసా విధి విధానాలపై ఇటీవలే కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులు చేసింది. ఈ సిఫార్సులను చర్చించి, వాటిపై విధివిధానాలు ఖరారు చేయబోతుంది మంత్రివర్గం.

గత నెల ఒక రోజు అసెంబ్లీ సమావేశం జరిగిన తర్వాత, సభ వాయిదా పడింది. ఇవాళ్టి నుంచి తిరిగి సభ ప్రారంభమవుతోంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు కొనసాగించాలనే విషయంపై ఇవాళ BAC సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఐదు రోజుల పాటు సభ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

CM రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్న బిల్లులు:

సీఎం రేవంత్ రెడ్డి క్రీడా విశ్వవిద్యాలయ బిల్లు, విశ్వవిద్యాలయాల సవరణ బిల్లులను స్వయంగా సభలో ప్రవేశపెట్టనున్నారు. బిల్లుల ప్రవేశపెట్టిన తర్వాత, ఉభయ సభల్లో పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.

రాష్ట్రంలో ఉన్న ఆకర్షణీయమైన స్థలాలు, ఆలయాల అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశంపై ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నెలాఖరు నాటికి కొత్త పర్యాటక పాలసీ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పర్యాటక విధానంపై అసెంబ్లీలో చర్చ జరగనుంది.

 

Leave a Comment

Vedika Media