• Home
  • Movie
  • తార‌లు- అరెస్టులు.. ఎప్పుడు.. ఎక్క‌డ‌.. ఎందుకు?
Image

తార‌లు- అరెస్టులు.. ఎప్పుడు.. ఎక్క‌డ‌.. ఎందుకు?

టాలీవుడ్ స్టార్‌, పుష్ప‌-2 హీరో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పుష్ప‌-2 సినిమా విడుద‌ల సంద‌ర్భంగా హైద‌రాబాద్ సంధ్య థియేట‌ర్‌లో విషాద ఘ‌ట‌న చోటుచేసుకున్న కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేప‌ధ్యంలో గ‌తంలో సినిమా తారలు ఎవ‌రైనా అరెస్ట‌య్యారా అని ఇంట‌ర్నెట్‌లో సెర్చ్ చేస్తున్న వారి సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. తార‌ల అరెస్టులు బాలీవుడ్‌కు కొత్త‌కాదు. బాలీవుడ్‌లో గ్లామ‌ర్ ప్ర‌పంచం మాటున అప్పుడ‌ప్పుడూ చోటుచేసుకునే అరెస్టులు అక్క‌డి చీక‌టి కోణాన్ని చూపిస్తాయి. బాలీవుడ్‌లో ప‌లువురు తార‌లు గ‌తంలో అరెస్ట‌య్యారు. ఆ జాబితాలోకి వెళితే..

సంజయ్ దత్: వివాదాల మున్నా భాయ్

బాలీవుడ్ న‌టుడు సంజయ్ దత్ జీవితం వివాదాల‌మ‌యంగా పేరుగాంచింది. 1993లో సంజ‌య్ ద‌త్ ఏకే-56 రైఫిల్‌తో సహా అక్రమ ఆయుధాలను కలిగి ఉన్నాడ‌నే ఆర‌ప‌ణ‌ల‌తో అరెస్టయ్యాడు. అతనికి ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. అయితే 42 నెలల శిక్ష తర్వాత 2016లో సంయ‌జ్‌ద‌త్ జైలు నుంచి విడుదలయ్యాడు.

సల్మాన్ ఖాన్: హిట్ అండ్ ర‌న్‌

సల్మాన్ ఖాన్ ఆఫ్-స్క్రీన్ చేష్టలు తరచూ వార్తల్లో క‌నిపిస్తుంటాయి. 2002లోపేవ్‌మెంట్‌పై నిద్రిస్తున్నకొంద‌రిపై అత‌ని కారు దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో ఒక వ్యక్తి మృతిచెందారు. వాహ‌నాన్ని నిర్లక్ష్యంగా న‌డిపినందుకు స‌ల్మాన్ ఖాన్‌ అరెస్టు అయ్యాడు. అతనికి ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. అయితే 2015లో స‌ల్మాన్‌ఖాన్ నిర్దోషిగా విడుదలయ్యాడు.

షైనీ అహుజా: ది ఫాల్ ఆఫ్ ఎ రైజింగ్ స్టార్

2000వ దశకం ప్రారంభంలో షైనీ అహుజా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉంది. అయితే అత‌ను 2009లో తన ఇంటిలోని 20 ఏళ్ల ఇంటి పనిమనిషిపై అత్యాచారం చేశాడనే ఆరోపణల‌తో అరెస్టయ్యాడు. ఈ కేసులో అతనికి ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. అయితే మూడేళ్ల శిక్ష తర్వాత 2011లో అహూజా విడుదలయ్యాడు.

ఫర్దీన్ ఖాన్: కొకైన్ వివాదం

2001లో కొకైన్ కలిగి ఉన్నాడ‌నే ఆరోప‌ణ‌ల‌తో ఫర్దీన్ ఖాన్ అరెస్ట‌య్యాడు. ఇది నాడు వార్త‌ల్లో ముఖ్యాంశంగా నిలిచింది. కోర్టు అతనికి రూ. 5,000 జరిమానా విధించి, హెచ్చరించి వ‌దిలేసింది.

మోనికా బేడీ: ప‌రారైన‌ నటి అంటుంటారు

2003లో పాస్‌పోర్టు ఫోర్జరీ కేసులో న‌టి మోనికా బేడీ అరెస్టయ్యాక ఆమె జీవితం నాటకీయ మలుపు తిరిగింది. అండర్ వరల్డ్ డాన్ అబూ సలేంతో ఆమెకు సంబంధాలున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. 2007లో ఆమె విడుదలైంది.

సూరజ్ పంచోలీ: జియా ఖాన్ కేసు

నటి జియాఖాన్ ఆత్మహత్యకు సహకరించాడ‌నే ఆరోపణలపై ఆదిత్య పంచోలి కుమారుడు సూరజ్ పంచోలిని 2013లో అరెస్టు చేశారు. 23 రోజుల జైలు జీవితం తర్వాత ఆయనకు బెయిల్ మంజూరైంది.

రాజ్‌పాల్ యాదవ్: ఫోర్జరీ కేసు

న‌టుడు రాజ్‌పాల్ యాదవ్‌ను 2018లో నకిలీ పత్రాలు సృష్టించి రుణం ఇప్పించారనే ఆరోపణలపై అరెస్టు చేశారు. అతనికి మూడు నెలల జైలు శిక్ష విధించారు.

విక్రమ్ ఛటర్జీ: ర్యాష్ డ్రైవింగ్ కేసు

విక్రమ్ ఛటర్జీ.. ప్ర‌ముఖ బెంగాలీ నటుడు. 2018లో ర్యాష్ డ్రైవింగ్ ఆరోపణలపై అరెస్టయ్యాడు. అత‌ని డ్రైవింగ్‌కు ఒక మోడ‌ల్ మృతిచెందింది. 18 రోజులు జైలు జీవితం గడిపిన తర్వాత ఆయనకు బెయిల్ మంజూరైంది.

రిచా చద్దా: కోర్టు ధిక్కార కేసు

న్యాయవ్యవస్థను విమర్శిస్తూ ట్వీట్లు చేస్తూ, కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారనే ఆరోపణలపై రిచా చద్దా 2019లో అరెస్టయ్యారు. ఆమెకు బెయిల్ మంజూరైంది. ఆమె తాను చేసిన ట్వీట్లకు క్షమాపణలు చెప్పారు.

పార్థ్ సమతాన్: వేధింపుల కేసు

20 ఏళ్ల యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై 2014లో పార్థ్ సమతాన్ అనే టీవీ నటుడు అరెస్టయ్యాడు. అతడికి బెయిల్ లభించడంతో పాటు ఆరోపణలను కోర్టు కొట్టివేసింది.

అలీ ఫజల్: ది డ్రంకెన్ బ్రాల్ కేసు

2017లో ముంబైలోని ఓ పబ్‌లో మద్యం మత్తులో గొడవకు దిగినందుకు అలీ ఫజల్‌ని అరెస్టు చేశారు. అతడికి బెయిల్ మంజూరు చేశారు. కోర్టు ముంగిట అత‌ను తన ప్రవర్తనకు క్షమాపణలు చెప్పాడు.

శ్వేతా బసు ప్రసాద్: వ్యభిచారం కేసు

జాతీయ అవార్డు గెలుచుకున్న నటి శ్వేతా బసు ప్రసాద్ 2014లో వ్యభిచార రాకెట్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలతో అరెస్టయ్యారు. ఆమెకు బెయిల్ మంజూరైంది. ఆమె త‌న‌పై వ‌చ్చిన ఆరోపణలను తిరస్కరించింది.

Releated Posts

మహేష్ బాబు చేయాల్సిన సినిమా దక్కించుకున్న రామ్ చరణ్…!!

సినీ పరిశ్రమలో ఒక కథ మరో హీరోకి వెళ్ళడం సాధారణమే. కానీ కొన్నిసార్లు అది ఒకరి కెరీర్‌ను మలుపు తిప్పే విధంగా మారిపోతుంది. అలాంటి…

ByByVedika TeamApr 19, 2025

షైన్ టామ్ చాకో అరెస్ట్ – డ్రగ్ కేసులో కీలక మలుపు..!!

ప్రముఖ నటుడు మరియు ‘దసరా’ విలన్‌ షైన్ టామ్ చాకో ఇటీవల వార్తల్లో హాట్ టాపిక్ అయ్యారు. రెండు రోజులుగా హోటల్ నుంచి తప్పించుకుని…

ByByVedika TeamApr 19, 2025

కేఎల్ రాహుల్ కుమార్తెకు నామకరణం: “ఇవారా” అర్థం ఏమిటి?

భారత క్రికెట్ స్టార్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి గత ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మార్చి 24న వీరిద్దరికీ ఓ…

ByByVedika TeamApr 18, 2025

మ్యాడ్ స్క్వేర్ థియేటర్ హిట్‌ తర్వాత ఓటీటీలోకి..??

చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సాధించిన సినిమాల్లో మ్యాడ్ ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. దర్శకుడు కళ్యాణ్ శంకర్ రూపొందించిన ఈ యువతరానికి…

ByByVedika TeamApr 18, 2025

Leave a Reply