Vedika Media

Vedika Media

vedika logo

గేమ్ ఛేంజర్ పుష్ప ని బీట్ చేయనుందా……

తెలుగు సినీ పరిశ్రమలో పుష్పా మరియు గేమ్ ఛేంజర్ చర్చనీయాంశగా మారాయి

గేమ్ ఛేంజర్  పుష్ప ని బీట్ చేయనుందా……

పుష్పా: ది రైజ్, సుకుమార్ దర్శకత్వంలో 2021లో విడుదలైన చిత్రం, ప్రేక్షకులను షాక్ కు గురిచేసింది. ఈ చిత్రం, ఆంధ్రప్రదేశ్ అడవులలో పెరిగిపోతున్న రెడ్ శాండల్ వుడ్ స్మగ్లింగ్ వ్యాపారం నేపధ్యంలో రూపొందింది. అల్లు అర్జున్, పుష్పా రాజ్ అనే రౌడీ పాత్రలో నటించి, తన నటనతో ప్రేక్షకులను అలరించాడు.

ఈ చిత్రం యొక్క విజయానికి కారణం, దాని కఠినమైన కథ, అద్భుతమైన విజువల్స్, మరియు అల్లు అర్జున్ యొక్క పవర్‌పాక్ పెర్ఫార్మెన్స్. “తగ్గెదే లే” అనే డైలాగ్ ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేశారు. ఈ సినిమా హిందీ భాషలో కూడా సంచలనం సృష్టించి, అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా పాన్-ఇండియా స్టార్ గా మారాడు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రం యొక్క విజయానికి మరొక కారణం. “శ్రీవల్లి” మరియు “ఊ ఆంటవా” వంటి పాటలు బాగా హిట్ అయ్యాయి. పుష్పా ఒక సాంఘిక అంశాన్ని ప్రదర్శిస్తూ, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో తెలుగు సినీరంగంలో ఒక మైల్‌స్టోన్‌గా నిలిచింది. అలానే పుష్ప 2 సినిమా పన్ ఇండియాగా బాక్స్ ఆఫీస్ బదలుగోటింది పుష్ప 2 లో అల్లు అర్జున్ యాక్టింగ్ కి ప్రేకషకులు ఫిదా అయ్యారు. ప్రేకషకులు ను ఎంతగానో  అలరించింది

మరోవైపు గేమ్ ఛేంజర్ చిత్రం కి వస్తే

గేమ్ చేంజర్ శంకర్ దర్శత్వంలో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం భారీ అంచనాలాతో ప్రేక్షుల ముందుకు రానుంది ఈ చిత్రం యాక్షన్, థ్రిల్లర్ మరియు డ్రామా సాగనుంది అని అంచనాలు ఉన్నాయి

ఈ చిత్రం కథని ఇంకా లీక్ చేయలేదు,కానీ అది శక్తి, రాజకీయం మరియు అవినీతిపై దృష్టి పెట్టేలా ఉన్నటు తెలుస్తుంది. రామ్ చరణ్ మరోసారి ప్రేక్షకుల మనసులను గెలవనున్నాడు. రామ్ చరణ్ ఇప్పటికే రంగస్థలం,RRR వంటి భారీ చిత్రాలతో తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. గేమ్ చంజర్ కూడా అతని మరింత పెద్ద స్థాయిలో నిలిపే అవకాశనీ కలిగిస్తుంది.

ఈ చిత్రంలో స్టార్ కాస్ట్ కూడా ఉందని చెప్తున్నారు.దానితో ఆ అంచనాలు మరింత పెరిగాయి. తమన్ సంగీతం కూడా ఈ చిత్రానికి ప్లస్ అని చెప్పుకోవచ్చు.

పుష్ప vs గేమ్ చెంజర్ పోటీ

ఈ రెండు చిత్రాలు ఒకే ప్రజలకు చేరుతాయి, కానీ వీటి శక్తి వేరు.

  1. కథ మరియు జోనర్

పుష్ప కథ గ్రామీణ నేపథ్యం మరియు ఎర్రటి శాండల్ వుడ్ స్మగ్లింగ్ వ్యాపారం ఆధారంగా, అలానే సాధారణ మనషుల పోరాటం మరియు పౌరిణికతని చూపించింది

గేమ్ చెంజర్ రాజకీయ,శక్తి పోరాటాల పై ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.శంకర్ యొక్క విజువల్ గ్రాండియర్ దీనికి చాలా ముఖ్యమైన అంశం అవుతుంది.

  1. సంగీతం మరియు విజువల్స్

పుష్ప లో దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఒక్క సరికొత్త ఊపుని ఇచ్చింది. అలాగే విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి

గేమ్ చెంజర్ లో తమన్ సంగీతం ఆసక్తి నీ పెంచుతుంది. మరియు శంకర్ అద్భుతమైనా విజువల్ ఎఫెక్ట్ మరియు భారీ యాక్షన్ సన్నివేశాలును ఆపరేట్ చేస్తారు అని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

  1. సంస్కృత ప్రభావం

పుష్ప అప్పటి నుండి సంస్కృతక ఫినామినా గా మారిపోయింది. అల్లు అర్జున్ యొక్క పుష్ప రాజ్ చిత్రం ఇప్పుడు భారతీయ సినిమాకు  ఒక్క మైల్స్టోన్

గేమ్ చెంజర్ ఇంకా విడుదలకు ముందే, ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి, శంకర్ మరియు రామ్ చరణ్ కలయికతో మరింత ప్రభావం చూపిస్తుంది.

తెలుగు సినిమాలో కొత్త అధ్యాయం

పుష్ప మరియు గేమ్ చెంజర్ రెండు తనదైన ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. పుష్ప ఇప్పటికే తన అద్భుత విజయంతో తెలుగు సినిమాకి  ఒక కొత్త ఒరవడిని ఇచ్చింది. గేమ్ చెంజర్ కూడా రాబోయే కాలంలో తెలుగు సినిమాకు మరింత ప్రగతిని తీసుకువెళ్ళడానికి సామర్థ్యంగా ఉంది అని తెలుస్తుంది. ఎలా ఉంటుంది అని 10 జనవరి 2025 వరకు వేచి చూడలిసి ఉంది.
https://vedikadaily.com/game-changer/ 

Leave a Comment

Vedika Media