Vedika Media

Vedika Media

vedika logo

పాక్ బోర్డు కండకావరం…. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన బిసిసిఐ

వచ్చే సంవత్సరం పాకిస్థాన్ దేశంలో ఫిబ్రవరి – మార్చిలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత ఆటగాళ్లను పంపేది లేదు అని బిసిసిఐ ఇప్పటికే తెగిసే చెప్పింది. భద్రత కారణాల దృష్ట్యా పాకిస్థాన్ దేశంలో ఆడబోము అని తెగేసి చెప్పింది మన బోర్డు. కానీ భారత జట్టు ఆడే మ్యాచ్ లు హైబ్రిడ్ మోడల్ లో పెట్టడం ఒక ఆప్షన్, టోర్నీ మొత్తాన్ని వేరే దేశానికి తరలించడం మరొక ఆప్షన్. అయితే ఈ ఆప్షన్స్ కి పాక్ బోర్డు ఒప్పుకోవడం లేదు. కానీ పాక్ బోర్డు కవ్వింపు చర్యలు మాత్రం ఆగడం లేదు. ఈ టోర్నీ మొత్తం పాకిస్తాన్ లోని లాహోర్, రావల్పిండి, కరాచీ వేదికలుగా మ్యాచ్లు జరగాల్సి ఉంది కానీ పాక్ బోర్డు మాత్రం pok లో టూర్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బిసిసిఐకి సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన బిసిసిఐ ఐసిసి కి సమాచారం అందించింది. దీంతో ఐసిసి స్పందించి pok టూర్ ను రద్దు చేసింది. దీంతో ప్రపంచం ముందు పాక్ పరువు పోయినట్టైంది. 

champions trophy latest updates

ఒకవేళ వేదిక మారినప్పటికీ పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించే అవకాశం ఉంది

నిజానికి భద్రతా కారణాల దృష్ట్యా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ పాకిస్థాన్‌కు రాకపోవడంపై పాక్ బోర్డు తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అయితే, భారత ప్రభుత్వం అనుమతిస్తే భారత జట్టు పాకిస్థాన్‌కు వెళుతుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా గతంలో ప్రకటించారు. ఇంకా… హైబ్రిడ్ ఫార్మాట్‌లో చాంపియన్‌షిప్ నిర్వహించాలని భారత్ నుంచి అభ్యర్థన వచ్చిందని, అయితే దీనిపై చర్చ జరగలేదని పీసీబీ చైర్మన్ మొహసేన్ నఖ్వీ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. అయితే… అకస్మాత్తుగా.. ఐసీసీ ఛాంపియన్స్ టూర్‌ని పీఓకే రద్దు చేయడంతో పాకిస్థాన్‌కు షాక్ తగిలింది. చివరి నిమిషంలో పాకిస్థాన్ నిష్క్రమిస్తే, దక్షిణాఫ్రికా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడానికి అవకాశం ఉన్నందున ఈ చర్య వచ్చింది. ఈ లెక్కన ఐసీసీ టోర్నీ వేదికను మార్చినా.. పాకిస్థాన్ టోర్నీ నుంచి వైదొలిగే అవకాశం లేకపోలేదు. 

champions trophy latest updates

పాక్ జట్టుకు నష్టం ఎంత వచ్చే అవకాశం ఉంది ? 

ఇప్పుడు ఉన్న పరిస్థితులలో పాక్  బోర్డు దగ్గర ఆటగాళ్ళకి జీతాలు ఇచ్చేందుకు సరిపడ డబ్బులు లేవు. దాదాపు చాల సంవత్సరాల తరువాత ఒక బిగ్ టోర్నీ నిర్వహించే అవకాశం దక్కించుకుంది. స్టేడియాల అభివృద్ది కోసం భారీగా ఖర్చు చేస్తుంది. ఈ టోర్నీ ద్వారా దాదాపు 700 కోట్లు సంపాదించాలని చూస్తుంది. కానీ భారత జట్టు రాకపోతే ఆ డబ్బులు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే భారత్ – పాక్ జట్లు తలపడితే వచ్చే కిక్ వేరేలా ఉంటుంది. కేవలం ఈ ఒక్క మ్యాచ్ నుంచే వందల కోట్లు వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా టూరిజం ద్వారా కూడ డబ్బు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి పాక్ ఎంత కవ్వింపు చర్యలకు పాల్పడిన బారత జట్టు అక్కడ అడుగు పెట్టదు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టోర్నీ ఇంకో దేశానికి తరలించే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. 

Leave a Comment

Vedika Media