సంజు సాంసన్ ఇప్పడు టీ20 లో సెన్సేషన్. మొన్న బంగ్లాదేశ్ తో జరిగిన చివరి మ్యాచ్ లో సెంచరీ చేశారు. అదే ఫామ్ ను కంటిన్యూ చేస్తూ సౌత్ ఆఫ్రికా లోని డర్బన్ లో జరిగిన మొదటి మ్యాచ్ లో కూడ సెంచరీ చేశారు. అయితే ఈ ఛాన్స్ సంజు కు అంత ఈజీగా రాలేదు. దీని వెనుక చాలా సంవత్సరాల శ్రమ, కృషి, పట్టుదల ఉంది. 2015లో మొదటి సారి సిరీస్ ఆడిన సంజు ఆ తరువాత అవకాశం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడవలసి వచ్చింది. ఐపీఎల్ రాణించిన కూడ టీం ఇండియాలో చోటు దక్కేది కాదు. ఎవరైనా గాయపడితే అప్పుడు చోటు దక్కేది కానీ తుది జట్టులో మాత్రం స్థానం ఉండేది కాదు. ఆ తరువాత కొన్ని ఛాన్సులు వచ్చిన అడపాదడపా రాణించేవారు. Fact behind Sanju Samson Success
సోషల్ మీడియాలో ఫాన్స్ మాత్రం ఇండియా క్రికెట్ ఫాన్స్ బీసీసీఐ సెలెక్టర్ లను ట్రోల్స్ చేసేవారు. నిజానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ కన్సిస్టెంట్ ప్లేయర్లలో సంజు ఒకరు. ఒక సారి కేరళలో ఇండియా మ్యాచ్ జరిగినప్పుడు అభిమానులు హంగామా అంత ఇంత కాదు. ఏకంగా స్టేడియం దారి పొడవునా సంజు ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయితే సంజుకు చోటు దక్కకపోవడానికి మరో అతను ఆడే ప్లేస్ లో అప్పటికే మరో క్రికెటర్ పాతుకుపోయారు. వికెట్ కీపర్ అయిన సంజుకు పంత్ నుంచి విపరీతమైన పోటీ ఉండేది. కానీ పంత్ ఐదో ప్లేస్ లో వచ్చే వారు. ధోని రిటైర్ అవ్వడంతో పంత్ ప్లేస్ పేర్మినెంట్ అయింది. దింతో సంజు కు ఛాన్స్ రాలేదు. కానీ ఎప్పుడైంతే రెండో సారి టి20 వరల్డ్ కప్ గెలిచాక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా రిటైర్ అవ్వడంతో బాంగ్లాదేశ్ తో జరిగిన టి20 మ్యాచ్ లలో సంజు సాంసన్ ఎంపిక అయ్యారు. రోహిత్ శర్మ రిటైర్ అవ్వడం, గిల్ కు గాయం అవ్వడంతో ఓపెనర్ గా అవతారం ఎత్తారు. హైదరాబాద్ లో జరిగిన మూడవ మ్యాచ్ లో సెంచరీ చేసి రాణించారు. నిన్న జరిగిన మ్యాచ్ లో కూడ సెంచరీ చేయడంతో సెలక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారింది.
టీంఇండియా కు టి20లలో రెగ్యులర్ ఓపెనర్ రోహిత్ రిటైర్ అవ్వడంతో గిల్ కూడ గాయపడటంతో సంజు ఓపెనర్ గా వచ్చి రాణించారు. మాములు కొట్టుడు కాదు ఒకప్పటి వీరేంద్ర సెహ్వాగ్ ను గుర్తుకు తెచ్చారు. దింతో సంజు రెగ్యులర్ ఓపెనర్ గా ఫ్యూచర్ లో కూడ ఆడే అవకాశం ఉంది. అంతే కాకుండా వన్డేలలో, టెస్ట్ లలో కూడ చోటు దక్కించుకునే అవకాశం ఉంది. మొత్తానికి సీనియర్లు రిటైర్ అవ్వడంతో సంజుకు ఛాన్స్ వచ్చింది.