ఐపియల్ మెగా వేలంలోకి కోల్కతా నైట్ రైడర్స్ విడిచిపెట్టింది. శ్రేయాస్ అయ్యర్ కు KKR ఇచ్చిన రిటెన్షన్ ప్యాకేజి నచ్చలేదు అని సీఈఓ ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఈ వేలంలోకి అయ్యర్ తో పాటు మరో నలుగురు గత కెప్టెన్లు వేలంలోకి వస్తున్నారు. దింతో ఈ సారి చాల ఫ్రాంచైజీలు కెప్టెన్లను వేలంలో కొనుక్కునే అవకాశం ఉంది. దింతో ఫ్రాంచైజీల మధ్య పోటీ పెరిగింది. అయితే శ్రేయాస్ అయ్యర్ కోసం చాలా టీంలు పోటీ పడుతున్నాయి. గత సీజన్లో విన్నింగ్ కెప్టెన్ కాబట్టి ఈ సారి అధిక ధర పలికే అవకాశం ఉంది. అయితే అయ్యర్ కోసం ఎవరెవరు పోటీ పడుతున్నారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం…
టైమ్స్ ఆఫ్ ఇండియాలోని ఒక నివేదిక ప్రకారం, చాలా ఫ్రాంచైజీలు అయ్యర్‌ను తమ జట్టులో చేర్చుకోవాలని యోచిస్తున్నాయి. అతడిని కెప్టెన్‌గా చేయాలని పలువురు కోరుతున్నారు. 2015 సంవత్సరంలో ఢిల్లీ జట్టు అయ్యర్ ను కొనుగోలు చేసింది. దింతో అరంగ్రేట సీజన్లో మొత్తం 14 మ్యాచ్ లు ఆడిన అయ్యార్ 4 అర్ధ సెంచరీలతో పాటు 439 పరుగులు చేశారు. 2016లో కూడ ఢిల్లీ జట్టుకు ఆడిన అయ్యర్ 6 మ్యాచ్ లు ఆడి కేవలం 30 పరుగులు మాత్రమే చేశారు. అదే విధంగా 2017 సీజన్లో కూడ 300 పరుగులు చేసి రాణించారు. 2018 సీజన్ కి వచ్చే సరికి గౌతమ్ గంభీర్ మధ్యలో కెప్టెన్సీ వదిలిపెట్టడంతో ఢిల్లీ యాజమాన్యం కెప్టెన్ చేసింది. 2019 నుంచి శాశ్వత కెప్టెన్ గా నియమితులయ్యారు. ఆ సీజన్లో ఢిల్లీ జట్టు 2012 తరువాత ప్లే ఆఫ్ కు అర్హత సాధించింది.
2020లో అయ్యర్ ఢిల్లీని ఫైనల్‌కు చేర్చాడు. ఢిల్లీ తొలిసారి ఫైనల్ ఆడింది. 2021లో గాయం కారణంగా అయ్యర్ జట్టు కు దూరం అయ్యారు అతను 2022లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మారాడు. ఆ సీజన్‌లో, అయ్యర్ 14 మ్యాచ్‌లు ఆడి 401 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధశతకాలు సాధించాడు. ఆ తర్వాత 2024లో తిరిగి జట్టులోకి వచ్చి టీమ్ ను ఛాంపియన్ గా నిలిచారు. ఈ సమయంలో అయ్యర్ రెండు అర్ధసెంచరీలతో సహా మొత్తం 351 పరుగులు చేశాడు. అందుతున్న సమాచారం మేరకు పంజాబ్ మరియు లక్నో జట్లు అయ్యర్ కోసం పోటీ పడవచ్చు అని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు. పంజాబ్ దగ్గర 110 కోట్ల డబ్బులు ఉన్నాయి. పంజాబ్ కేవలం ఇద్దరినీ మాత్రమే రిటైన్ చేసుకుంది. లక్నో జట్టు కూడ కెప్టెన్ అన్వేషణలో ఉంది. అయితే ఈ రెండు టీంలు అయ్యార్ కోసం హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది. వీళ్ళతో పాటు మరికొన్ని టీంలు కూడ అయ్యర్ కోసం పోటీ పడవచ్చు.