గతంలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చాలా అరుదుగా వినేవాళ్లం. కానీ మారుతున్న జీవన శైలి కారణంగా కిడ్నీ సమస్యలు పెరిగి, మార్పిడులు విపరీతంగా జరుగుతున్నాయి. అయితే, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ మహిళ (30)కు ఇప్పటివరకు మూడుసార్లు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేయడం ఆశ్చర్యకరమైన విషయం.

నందిగామకు చెందిన ఈ మహిళకు కిడ్నీ ఫెయిల్ కావడంతో, మొదటి సారి తల్లి, రెండోసారి భర్త కిడ్నీ దానం చేశారు. కానీ, ఆ రెండు మార్పిడులు విఫలమయ్యాయి. చివరికి, డాక్టర్ల సలహా మేరకు, మూడోసారి తండ్రి తన కిడ్నీ దానం చేశారు. విజయవాడలోని శరత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆసుపత్రిలో నెఫ్రాలజిస్ట్ శరత్‌బాబు నేతృత్వంలో ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది.
ఒకే వ్యక్తికి మూడుసార్లు కిడ్నీ మార్పిడి జరగడం చాలా అరుదైన విషయం అని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ మహిళ ఆరోగ్యంగా ఉండడం అందరికీ సంతోషం కలిగిస్తోంది.
ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.