• Home
  • Andhra Pradesh
  • 2024లో దేశంలో చోటుచేసుకున్న ముఖ్య ఘ‌ట‌న‌లు
Image

2024లో దేశంలో చోటుచేసుకున్న ముఖ్య ఘ‌ట‌న‌లు

ప్రస్తుతం మనం 2024 డిసెంబర్ చివరి నెలలో ఉన్నాం. ప్రపంచం త్వరలో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది. రాబోయే సంవత్సరం కొత్త ఆశలను సంతరించుకుంటే, గడచిన సంవత్సరం అనేక పాఠాలను మిగిల్చింది. నూతన సంవత్సరానికి ప్రజలు స్వాగతం చెప్పడానికి సిద్ధమవుతున్న ఈ తరుణంలో, 2024లో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలను ఒకసారి నెమరువేసుకుందాం.

1. రామ మందిర ప్రారంభోత్సవం
2024 జనవరి 22న అయోధ్యలోని రామ మందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో వేద మంత్రాల నడుమ నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని చూసేందుకు దేశంలోని పలు ప్రఖ్యాత వ్యక్తులు అయోధ్యకు తరలివచ్చారు.

2. ఇన్సాట్-3డీఎస్ ఉపగ్రహ ప్రయోగం
ఫిబ్రవరిలో ఇస్రో అత్యాధునిక ఇన్సాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జరిగింది.

3. ఎయిర్ ఇండియా సిబ్బంది సమ్మె
మే నెలలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ క్యాబిన్ సిబ్బంది సమ్మె చేయడంతో 170కి పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

4. నీట్ వివాదం
జూన్ 4న నీట్ (యూజీ) 2024 ఫలితాలు విడుదలయ్యాక, పలు అక్రమాల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. పరీక్షలో 720 మార్కులకు 720 మార్కులు పొందినవారి సంఖ్య పెరగడం, టాప్ ర్యాంకులు సాధించిన వారిలో ఎనిమిది మంది ఒకే కేంద్రంలో పరీక్షలు రాయడం అనుమానాలకు దారితీసింది.

5. నెట్ పరీక్ష రద్దు
నీట్ వివాదం కొనసాగుతున్న క్రమంలో, జూన్ 18న నిర్వహించిన యూజీసీ నెట్-2024 పరీక్షను అవకతవకల కారణంగా ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశాలు జారీచేసింది.

6. రియాసీలో ఉగ్రదాడి
జూన్ 9న జమ్ముకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయి, 33 మంది గాయపడ్డారు.

7. వయనాడ్ కొండచరియలు
జూలై 30న కేరళలో వర్షాల కారణంగా వయనాడ్‌లో నాలుగు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి, 80కి పైగా ప్రాణ నష్టం,వంద మందికిపైగా గల్లంతు చోటుచేసుకున్నాయి.

8. కోల్‌కతా అత్యాచారం కేసు
ఆగస్టు 9న కోల్‌కతా ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో మహిళా డాక్టర్ మృతదేహం వెలుగులోకి వచ్చింది. విచారణలో ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది.

9. బాబా సిద్ధిఖీ హత్య
అక్టోబర్ 12న ముంబైలోని బాంద్రా ప్రాంతంలో బాబా సిద్ధిఖీపై కాల్పులు జరిపారు. ఈ హత్యలో లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్ హస్తం ఉందని సమాచారం.

10. లోయలో పడిన బస్సు
ఉత్తరాఖండ్‌లో అల్మోరా సమీపంలో ఓ బస్సు లోయలో పడడంతో 36 మంది మృతి చెందారు. కెపాసిటీ కంటే ఎక్కువ మంది ప్రయాణం చేయడం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలన్నీ 2024 సంవత్సరం ఎంతగానో ప్రభావితం చేశాయి. వాటి నుండి పాఠాలు నేర్చుకోవడం మన బాధ్యత.

Releated Posts

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు: ఎండలు, వడగాలులు, వర్షాలతో ప్రజలు అలసట…

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. ఒక వైపు ఎండ వేడి, ఉక్కబోత ప్రజలను వేధిస్తుండగా, మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో…

ByByVedika TeamMay 10, 2025

ఆంధ్రప్రదేశ్ ఈ-క్యాబినెట్ కీలక నిర్ణయాలు | చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి ప్రణాళికలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన ఈ-క్యాబినెట్ సమావేశంలో పలు అభివృద్ధి చర్యలపై మంత్రి మండలి కీలక నిర్ణయాలు…

ByByVedika TeamMay 9, 2025

పాక్ ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ వైరస్ దాడి – భారత్ అప్రమత్తం..

భారత్ – పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న క్రమంలో, పాకిస్తాన్ కుతంత్రాలకు భారత సాయుధ దళాలు దిమ్మ తిరిగే మాస్టర్ ప్లాన్స్‌తో సమాధానం…

ByByVedika TeamMay 9, 2025

Leave a Reply