Vedika Media

Vedika Media

vedika logo

హైదరాబాద్: ఇదెక్కడి దరిద్రంరా నాయనా.. బూట్లు, చెప్పులు ఎత్తుకెళ్లి..!

హైదరాబాద్‌ ఉప్పల్‌ ప్రాంతంలోని భరత్‌ నగర్‌లో ఇటీవల కాలంలో చెప్పులు, షూలు మాయమవుతున్న ఘటనలు స్థానికులను ఆందోళనకు గురిచేశాయి. మొదట ఈ చోరీలను సాధారణ దొంగతనంగా భావించిన స్థానికులు, కొంతకాలానికే దీని వెనుక పెద్ద కుట్ర ఉందని తెలుసుకున్నారు.

ఉప్పల్‌ భరత్‌ నగర్‌లో చెప్పులు, షూలు మాయమవడం ఆలస్యంగా తెలిసిన స్థానికులు, కొన్ని విచిత్రమైన విషయాలను తెలుసుకున్నారు. చోరీ చేసిన చెప్పులు, షూలను ఓ దంపతులు వినూత్నంగా దాచిపెట్టి, తన ఇంటినే చెప్పుల గోడౌన్‌గా మార్చి, అవి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

బుధవారం, అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని ఒక స్థానిక వ్యక్తి అనుసరించాడు. ఇంకొంత మంది స్థానికుల సహకారంతో అతడి వద్ద విచారణ చేయగా, అనేక చోరీల వెనుక ఉన్న కుట్ర బయటపడింది. నిందితుల ఇంట్లోని బ్యాగులు, అలమారాలు, కప్పుపై చెప్పులు, షూలు దాచిపెట్టినట్లు గుర్తించారు. దాదాపు 100 జతల దొంగతనం చేసిన చెప్పులు, స్లిప్పర్లు వారి ఇంట్లో కనిపించాయి.

చోరీకి గురైన కొన్ని చెప్పులను స్థానికులు తమవిగా గుర్తించారు. ఈ ఆధారంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ కెమెరా ఆధారాలు, స్థానికుల సహకారంతో దుండగులను అదుపులోకి తీసుకున్నారు. దంపతులు చెప్పుల చోరీ చేసి, వాటిని ఎర్రగడ్డ మార్కెట్లో రూ.100-200కు విక్రయిస్తున్నట్లు నిందితులు అంగీకరించారు.

పోలీసుల విచారణలో నిందితులు వాసవీ నగర్‌కు చెందిన తళారి మల్లేశ్, అతని భార్య రేణుకగా గుర్తించారు. రేణుక ఇటీవల మద్యం మత్తులో పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి హల్చల్ చేసినట్లు అధికారులు తెలిపారు. దుండగులు నేరం అంగీకరించడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.

ఈ కేసును విజయవంతంగా ఛేదించిన పోలీసులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. నిందితులు మరిన్ని చోరీలకు పాల్పడ్డారా లేదా అనేది ఇంకా దర్యాప్తు చేస్తున్నారు.

https://www.youtube.com/shorts/NdWH2CM2yo0

Leave a Comment

Vedika Media